• search
  • Live TV
కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నెలలో తేలిక కాదు: డిఎల్, అవుతుంది: జానా రెడ్డి

By Pratap
|

DL Ravindra Reddy
కడప/ హైదరాబాద్: నీటి కేటాయింపులు, తదితర ప్రాధాన్యత గల అంశాల నేపథ్యంలో తెలంగాణ విషయాన్ని నెలలో పరిష్కరించడం అంత సులువు కాదని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం సుదీర్ఘ కసరత్తు చేసి ఓ నిర్ణయానికి వచ్చిందని ఆయన అన్నారు. కడప స్టేట్ గెస్ట్‌హౌస్‌లో ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

తెలంగాణ రాదన్న అనుమానంతో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) బంద్‌కు పిలుపునిచ్చినట్లు వుందని వ్యంగ్యంగా అన్నారు. నెహ్రూ సూచించిన విధంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలకే తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని, అయితే కాంగ్రెస్ అధిష్ఠానం, కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు.

కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటనతో తెలంగాణ ఏర్పాటుకు ఓ రోడ్ మ్యాప్ వచ్చే అవకాశముందని పంచాయతీ రాజ్ శాఖా మంత్రి కుందూరు జానారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ స్వప్నం త్వరలోనే సాకారమవనుందని కాంగ్రెస్ సీనియర్ నేత కె.కేశవరావు అన్నారు. రాష్ట్రం ఏర్పడే దాకా కేంద్రంపై ఒత్తిడి కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

సిపిఎం ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించినా తెలంగాణ ఏర్పాటుపై ప్రతికూలంగా వ్యవహరించడం లేదన్నారు. ఎంఐఎం కూడా రాయల తెలంగాణకు మద్దతు పలుకుతోందని, అదీ కుదరని పక్షంలో హైదరాబాద్‌ను తెలంగాణకు దూరం చేయవ్దని చెప్పిందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే వరకు కెసిఆర్‌తో కలిసే పోరాటం చేస్తామన్నారు. తెలంగాణ కోసం ఇప్పటికే వెయ్యి మంది యువకులు చనిపోయారని, ఇప్పటికీ నిర్ణయం తీసుకోరా అని కాంగ్రెసు సీనియర్ నేత ఎం. సత్యనారాయణ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్యాకేజీలను తెలంగాణ వాదులెవరూ అంగీకరించరని స్పష్టం చేశారు. అఖిలపక్షంలో కాంగ్రెస్ ప్రతినిధులు పరస్పర విరుద్ధ అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో రాష్ట్రం ఇకపై కలిసి ఉండడం సాధ్యం కాదని తేలినట్టే అని తెలంగాణ సారధ్య బృందం నేత జి.నిరంజన్ అన్నారు. అయితే, గ్రేటర్ హైదరాబాద్ ప్రతినిధులుగా తమను అఖిల పక్షానికి పిలవకపోవడంపై బాధ కలిగిందని మంత్రి దానం నాగేందర్ అన్నారు. షిండే ప్రకటనపై మాజీ మంత్రి జెసి దివాకర్‌రెడ్డి స్పందిస్తూ నెల రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దామన్నారు.అందరూ పాతపాటే పాడిన ఈ సమావేశంలో కొత్తదనం ఏముందని ప్రశ్నించారు.

కాంగ్రెస్ నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని మంత్రులు రఘువీరా, పార్థసారధి వెల్లడించారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తెలంగాణకు మద్దతు పలికినా పార్లమెంట్‌లో జై ఆంధ్రా అంటాయని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం తొందరపాటు నిర్ణయం ప్రకటిస్తే రాజీనామాకు సిద్ధమని విశాఖపట్నంలో మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు.

రాష్ట్ర విభజన అంశం అంత తేలికైన విషయం కాదని అటవీశాఖమంత్రి శత్రుచర్ల విజయరామరాజు అన్నారు. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని విజయనగరంలో ప్రకటించారు.

English summary
Different opinions are aired on the union home minister Sushil Kumar Shinde's statement on Telangana issue. Minister DL Ravindra Reddy said that it is not easy to solve Telangana issue within a month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X