జైల్లో అధినేత: న్యూఇయర్ వేడుకలకి జగన్ పార్టీ దూరం

అక్రమాస్తుల కేసులో వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఈ సంవత్సరం మే 27వ తేదిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) అరెస్టు చేసింది. తనను అరెస్టును సవాల్ చేస్తూ జగన్ పలుమార్లు నాంపల్లి సిబిఐ కోర్టు నుండి సుప్రీం కోర్టు వరకు వెళ్లారు. తనకు బెయిల్ ఇవ్వాలంటూ కూడా అతను కోర్టులలో పలుమార్లు పిటిషన్ పెట్టుకున్నారు. కానీ అతనికి ఇప్పటి వరకు బెయిల్ దొరకలేదు. జగన్‌కు బెయిల్ వస్తుందని పార్టీ నేతలు ఎప్పటికప్పుడు ఆశలు పెట్టుకుంటున్నారు.
కానీ బెయిల్ మాత్రం రావడం లేదు. సుప్రీం కోర్టులో గతంలో బెయిల్ పైన చుక్కెదురయింది. 2013 మార్చి నెలాఖరు వరకు విచారణ పూర్తి చేయాలని సిబిఐని ఆదేశించిన సుప్రీం కోర్టు అప్పటి వరకు బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవద్దని జగన్‌కు సూచించింది. అయితే జగన్ ఇటీవల నాంపల్లి కోర్టులో స్టాట్యూటరీ, రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌లను దాఖలు చేశారు. స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్‌ను సిబిఐ కోర్టుతో పాటు హైకోర్టు కూడా తోసిపుచ్చింది.
స్టాట్యూటరీ బెయిల్‌ను హైకోర్టు తోసిపూచ్చింది. రెగ్యులర్ బెయిల్ పైన విచారణ వచ్చే జనవరి 4వ తేదికి వాయిదా పడింది. జనవరి 4నహైకోర్టులో తమ అధినేతకు బెయిల్ వస్తుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మరోసారి ఆశలు పెట్టుకుంది. జగన్ జైలులో ఉండటంతో నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని పార్టీ నిర్ణయించుకుంది.












Click it and Unblock the Notifications