రేప్‌విక్టిం కోసమైతే: జగన్‌పార్టీపై గాలి, తెలంగాణపై బొజ్జల

జగన్ కోసం పదే పదే బెయిల్ దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఆ పార్టీ నేతలు కోర్టులను అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. అవినీతికి పాల్పడ్డ పలువురు అధికారులపై ప్రభుత్వం సోదాలు నిర్వహిస్తోందని, జగన్‌ను ఎందుకు వదిలేస్తుందో చెప్పాలని ప్రశ్నించారు.
జగన్ జైల్లో ఉండటంతో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోమని ఆ పార్టీ ప్రకటించిందని, జగన్‌కు బదులు గ్యాంగ్ రేప్ బాధితురాలి కోసం రద్దు చేసుకుంటే అర్థవంతంగా ఉండేదన్నారు. 2004లో లక్షల్లో ఉన్న వైయస్ జగన్ ఆదాయం ఏడేళ్లలో వందల కోట్లకు ఎలా పెరిగిందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. మంత్రి ధర్మాన ప్రసాద రావును వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
2008 లేఖకు కట్టుబడి ఉన్నాం
2007 నుండి తమ పార్టీలో తెలంగాణపై చర్చ జరుగుతోందని బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి అన్నారు. 2008 నిర్ణయానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. తెలంగాణపై పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయానికి పార్టీ అంతా కట్టుబడి ఉండాలని సూచించారు. కేంద్రమే తెలంగాణ అంశాన్ని సంక్లిష్టం చేస్తోందన్నారు. తెలంగాణపై కాంగ్రెసు వైఖరి ఏమిటో సుస్పష్టం చేయాలని బొజ్జల డిమాండ్ చేశారు. అఖిల పక్షంలో తాము ఒకే వైఖరి చెప్పామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే బాబు నిర్ణయం తీసుకున్నారన్నారు.
నోరున్నోడిది రాజ్యం కావొద్దు
నోరున్నోడిదే రాజ్యం కావొద్దని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కారణంగా శ్రీకృష్ణ కమిటీ నివేదికకు న్యాయం జరగటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకృష్ణ కమిటీ ఆధారంగానే విభజనపై నిర్ణయం తీసుకోవాలన్నారు. సీమాంధ్రలో కూడా వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయన్నారు. శ్రీకృష్ణ కమిటీ ముగిసిన అధ్యాయం అని కాంగ్రెసు పెద్దలు చెప్పడం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications