హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తేల్చండి: మంత్రులు, తెలంగాణపై అంతా తెల్సు: ప్రణబ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pranab Mukherjee
హైదరాబాద్: తెలంగాణ అంశంపై మీరు జోక్యం చేసుకోవాలని, త్వరగా ఈ సమస్య పరిష్కారమయ్యేలా చూడాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని తెలంగాణ ప్రాంత మంత్రులు మంగళవారం కోరారు. బొల్లారంలోని రాష్ట్రపతి భవనంలో తెలంగాణ మంత్రులు ప్రణబ్‌ను కలిశారు. రాష్ట్రపతిని కలిసిన మంత్రులలో సబితా ఇంద్రా రెడ్డి, సునీత లక్ష్మా రెడ్డి, బస్వరాజు సారయ్య. జె.గీతా రెడ్డి, సుదర్శన్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు ఉన్నారు.

రాష్ట్రపతికి వారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ గురించి మీకు అంతా తెలుసునని, రాష్ట్రం ఏర్పాటు కోసం మీ అధికారాలు ఉపయోగించి చొరవ తీసుకోవాలని వారు ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఈ సంవత్సరమైనా మా కోరిక నెరవేర్చాలని ఆయనను కోరారు. తెలంగాణ ఎప్పుడు వస్తుందో అప్పుడే తమకు తమకు న్యూ ఇయర్ అని వారు రాష్ట్రపతితో చెప్పారని సమాచారం. తెలంగాణపై మీకు పూర్తిగా అవగాహన ఉందని ప్రణబ్‌తో వారు చెప్పారు.

రాష్ట్రపతిని కలిసిన అనంతరం మంత్రులు మాట్లాడారు. అన్ని పార్టీలు ఇటీవల జరిగిన అఖిల పక్ష సమావేశంలో తమ అభిప్రాయాలు చెప్పాయన్నారు. ఇక నిర్ణయం తీసుకోవాల్సిందే కేంద్రమే అన్నారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే వచ్చే ఎన్నికల్లో ఇరు ప్రాంతాల్లోనూ కాంగ్రెసు పార్టీయే అధికారంలోకి వస్తుందని వారు అన్నారు. తాము చెప్పింది ప్రణబ్ ముఖర్జీ సావదానంగా విన్నారని, సానుకూలంగా స్పందించారన్నారు.

తనకు తెలంగాణ సమస్య గురించి పూర్తిగా తెలుసునని ప్రణబ్ ముఖర్జీ తమతో చెప్పారన్నారు. తెలంగాణపై త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటనను ప్రస్తావిస్తూ... మహిళలకు భద్రత కల్పించాలని మంత్రులకు సూచించారు.

English summary
President of India Pranab Mukherjee has told to Telangana ministers that he know everything about Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X