ఫ్లెక్సీ చించివేత: జగన్ పార్టీ X కాంగ్రెస్, మారిన సీన్

ఇది ఇరువర్గాల మధ్య వాదనకు దారి తీసింది. వాదన కాస్త ఘర్షణకు దారి తీసింది. ఇరు వర్గాలు కర్రలు పట్టుకొని బాహాబాహీకి దిగాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇరు వర్గాలు కర్రలతో రోడ్ల పైకి వచ్చాయి. దాదాపు నాలుగు వందల మంది బాహాబాహీకి దిగాయి. అయితే ఈ ఘర్షణ కాస్తా పార్టీల నుండి ఆ తర్వాత రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణగా మారింది.
సామాజిక వర్గాల మధ్య ఘర్షణగా మారడంతో ఇరు పార్టీలు జోక్యం చేసుకునేందుకు నిరాకరిస్తున్నాయి. అధికారులతో దీనికి పుల్ స్టాప్ పెట్టించాలని చూస్తున్నాయి. కాగా గ్రామంలోని పరిస్థితి తెలియడంతో పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. మరింత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించారు. శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు. గాయపడ్డ వారిని ఏలేశ్వరం ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.












Click it and Unblock the Notifications