మజ్లిస్‌తో కల్సి జగన్ కుట్ర: కెటిఆర్, వెళ్లేందుకే: రాజయ్య

Taraka Rama rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకిస్తున్న మజ్లిస్ పార్టీతో కలిపి కుట్ర పన్నుతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు ఆదివారం ధ్వజమెత్తారు. జగన్, మజ్లిస్ పార్టీలు తెలంగాణను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు.

మజ్లిస్‌తో కలిసి మతకలహాలను సృష్టించి తెలంగాణ అడ్డుకోవాలని ప్రయత్నాలు జగన్ చేస్తున్నారని విమర్శించారు. గతంలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హైదరాబాదులో మతకలహాలు సృష్టించారని, ఇప్పుడు జగన్ ఆయన బాటలోనే నడుస్తున్నారని విమర్శించారు. జగన్ శిఖండి పాత్ర పోషిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పరిపాలన అనుభవం లేకపోవడం వల్లనే విద్యుత్ ఛార్జీలను ఇష్టం వచ్చినట్లుగా పెంచుతున్నారన్నారు. ఛార్జీల పెంపు ప్రతిపాదన ఉపసంహరించుకునే వరకు ఉద్యమిస్తామన్నారు.

కిరణ్, మజ్లిస్‌పై బండారు దత్తాత్రేయ

వచ్చే సాధారణ ఎన్నికల్లో ఓడిపోతామనే అక్కసుతోనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రజల పైన విద్యుత్తు ఛార్జీల భారం మోపుతున్నారని బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఆరోపించారు. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

కిరణ్ పాలనలో రాష్ట్రం అంధకార ప్రదేశ్‌గా మారిందన్నారు. మజ్లిస్ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తాము హిందువులకు వ్యతిరేకం కాదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. హిందూ దేవతల పైన, హిందువుల పైన ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యానిస్తున్న మజ్లిస్ నేతలపై చర్యలు తీసుకోవాలన్నారు. మజ్లిస్ పార్టీకి రాజకీయ అజెండా లేదన్నారు.

అసద్ ఎప్పుడైనా హిందువుల సమస్యలను అసెంబ్లీలో, పార్లమెంటులో ప్రస్తావించారా అని ప్రశ్నించారు. అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు తన సోదరుడు, మజ్లిస్ శాససనభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను సమర్థించినట్లుగా ఉన్నాయని బండారు దత్తాత్రేయ విమర్శించారు.

కావూరిపై రాజయ్య

ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావుకు మంత్రి పదవి రాలేదనే తెలంగాణ వ్యతిరేక వాదన మరింత ఎక్కువగా వినిపిస్తున్నారని వరంగల్ ఎంపి రాజయ్య అన్నారు. ఆయన వేరే పార్టీలోకి వెళ్లేందుకే ఇలా చేస్తున్నారన్నారు. కాంగ్రెసు పార్టీ పైన ఆయనకు నమ్మకం లేదన్నారు. సెంటిమెంట్ ఆధారంగా రాష్ట్రాన్ని విడగొట్టడం సరికాదని కావూరి చెప్పడం విడ్డూరమన్నారు. ఆయనకు తెలంగాణపై పరిజ్ఞానం లేదన్నారు. తెలంగాణ ఇస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందనడం సరికాదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+