వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బట్టలిప్పేస్తానని పూనం, నగ్నఫోటోలతో షెర్లిన్: అనురాగ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Anurag Thakur
న్యూఢిల్లీ: ఇటీవల పలువురు ప్రముఖులు వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటనపై ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్, మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ థాకరే సంచలన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా భారతీయ జనతా పార్టీ యువమోర్చా అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ కూడా అదే విధంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

భారతీయ నేతలు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతిలో కీలు బొమ్మలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా అసభ్యంగా మారిపోయిందని ఆయన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఇండియాకు భారత్‌కు మధ్య తేడా ఏమిటంటే.. ఇండియాలో డర్టీ పిక్చర్ సినిమా జాతీయ అవార్డును గెలుచుకుంటుందని ఎద్దేవా చేశారు. మహేశ్‌భట్ తన కూతురుతో శృంగారం గురించి మాట్లాడతాడని, ప్లేబోయ్ పత్రిక కవర్ పేజీ కోసం షెర్లిన్ చోప్రా తన నగ్న ఫొటోలను అందిస్తుందని మండిపడ్డాడు.

విదేశీ నీలి చిత్రాల తార పుట్టిన రోజును మీడియా జరుపుకుంటోందని, ఇండియాలో పూనం పాండేలాంటి వారు బట్టలు విప్పేస్తామని బహిరంగంగానే మాట్లాడతారన్నారు. అనురాగ్ ఠాకూర్ ఇలా తనదైన శైలిలో ఇండియాకు - భారత్‌కు తేడాను ఫేస్ బుక్‌లో వివరించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఉద్దేశిస్తూ.. ఇండియాలో ప్రముఖ నేతలు మంత్రగత్తె చేతిలో తోలు బొమ్మలన్నారు.

కాగా, అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలు ఆయన వెనుకబాటు మనస్తత్వాన్ని తెలియజేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సందీప్ దీక్షిత్ విమర్శించారు. కొందరు ఈ దేశాన్ని భారత్ - ఇండియా, మహారాష్ట్ర - బీహార్ అంటూ విభజిస్తున్నారని, ఇది మన జాతికి, ప్రజాస్వామ్యానికి హానికరమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రషీద్ అల్వీ వ్యాఖ్యానించారు. జాతిని చీల్చే వ్యాఖ్యలు చేస్తున్న పార్టీలపై అనర్హత వేటు వేయాలని బిజెపి నేత గిరిరాజ్ సింగ్ డిమాండ్ చేశారు.

English summary
After inviting controversy for his alleged facebook post calling Congress chief Sonia Gandhi a witch, Bharatiya Janata Yuva Morcha (BJYM) chief Anurag Thakur has said that he had not posted the matter on the social networking site.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X