వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'కెసిఆర్‌కు ఉత్తమ రైతు అవార్డు: మా పార్టీ నేతలు లేరు'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kadiyam Srihari
వరంగల్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తెలంగాణ రావడం ఏమాత్రం ఇష్టం లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి బుధవారం అన్నారు. ఈ నెల 28వ తేదిలోపు తెలంగాణ సమస్యకు పరిష్కారం చూపిస్తామని కేంద్రం చెప్పిందని, ఇలాంటి కీలక ప్రకటన సమయంలో కెసిఆర్ తన ఫాం హౌస్‌కు పరిమితమయ్యారని ఆరోపించారు.

ఇప్పుడు తెలంగాణ రాకుండా ఉంటే ఉద్యమం పేరుతో 2014లో రాజకీయ లబ్ధి పొందాలని కెసిఆర్, టిఆర్ఎస్ చూస్తోందని, అందుకే కీలక ప్రకటన సమయంలో తన ఫాం హౌస్‌కి పరిమితమై అక్కడ కూరగాయలు పండించే పనిలే పడ్డారని ఎద్దేవా చేశారు. కెసిఆర్‌కు ఉత్తమ రైతు అవార్డు ఇవ్వాలన్నారు. కెసిఆర్ ఇప్పటికైనా ఫాం హౌస్ నుండి బయటకు రావాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు.

తమ పార్టీ పైన కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణపై తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన వైఖరి చెప్పారని, దానిని అఖిల పక్ష సమావేశంలో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు ఇచ్చామన్నారు. తమపై దుష్ప్రచారం జరుగుతోంది. కాబట్టి అఖిల పక్షం మినట్స్ బహిర్గతం చేయాలని తాము షిండేకు లేఖ రాస్తామన్నారు. పలు పార్టీలో కావాలనే తమపై బురద జల్లుతున్నాయన్నారు.

తమకు హైదరాబాదుతో కూడిన తెలంగాణ కావాలన్నారు. సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ నేతలు పయ్యావుల కేశవ్, కోడెల శివప్రసాద్ తదితరులు చేసిన వ్యాఖ్యలు వారి వ్యక్తిగతం అన్నారు. వారి వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదన్నారు. తమ పార్టీకి చెందిన సీమాంధ్ర నేతలు ఎవరూ రేపటి సమైక్యాంధ్ర సమావేశంలో పాల్గొనడం లేదన్నారు. అది కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర నేతల సమావేశం మాత్రమే అన్నారు.

English summary
Telugudesam Party senior leader and former minister Kadiyam Srihari said on Wednesday that TRS chief K Chandrasekhar Rao is eligible for best farmer award.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X