వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఇష్యూ: ఢిల్లీలో డిజిపి, ప్రధాన కార్యదర్శి

By Pratap
|
Google Oneindia TeluguNews

Minnie Mathew-DGP Dinesh Reddy
న్యూఢిల్లీ: తెలంగాణ సమస్యను పరిష్కరించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసిన క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూస్, డిజిపి దినేష్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. తెలంగాణ సమస్యకు పరిష్కారం ప్రకటించే క్రమంలో వారితో హోం శాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు మిన్నీ మాథ్యూస్‌, దినేష్ రెడ్డితో పాటు ఇంటలిజెన్స్ చీఫ్ మహేందర్ రెడ్డి కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఆర్‌కె సింగ్‌తో గురువారం సమావేశమయ్యారు.

ఆర్‌కె సింగ్ గంట పాటు రాష్ట్రానికి చెందిన ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి చెందిన నీటి పారుదల, విద్యుచ్ఛక్తి శాఖల అధికారులు కూడా పాల్గొన్నట్లు సమాచారం. కాగా, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేతో సమావేశమయ్యారు. తెలంగాణ అంశంపై షిండే బొత్సతో మాట్లాడినట్లు తెలుస్తోంది.

తెలంగాణపై నెల రోజుల లోగా నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే డిసెంబర్ 28వ తేదీన జరిగిన అఖిల పక్ష సమావేశంలో చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోబోతున్నట్లు షిండే ఆ సమావేశంలోనే సూచనప్రాయంగా తెలిపారని కూడా వార్తలు వచ్చాయి.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటి వరకైతే కాంగ్రెసు అధిష్టానం తెలంగాణ ఇవ్వడానికి నిర్ణయించుకున్నట్లే సంకేతాలు అందుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాదులో సీమాంధ్ర ప్రజాప్రతినిధులు సమావేశమై రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఓ తీర్మానం చేశారు. ఆ సమావేశాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన తెలంగాణ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.

English summary
Amid intensified efforts by the central government to resolve the Telangana issue, the Andhra Pradesh chief secretary and police chief have been summoned to New Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X