హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై చెప్పా: పురంధేశ్వరి, బాబుపై లక్ష్మీ పార్వతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Purandeswari
హైదరాబాద్: స్వర్గీయ నందమూరి తారక రామారావు కూతురుగా పుట్టడం తన అదృష్టమని కేంద్రమంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి శుక్రవారం అన్నారు. ఎన్టీఆర్ 17వ వర్ధంతి సందర్భంగా దగ్గుపాటి వెంకటేశ్వర రావు, పురంధేశ్వరిలు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఉదయం నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తనకు మళ్లీ జన్మ అంటూ ఉంటే ఆయన కూతురుగానే పుట్టాలని కోరుకుంటున్నానని అన్నారు. ఆయన మృతి చెంది పదిహేడేళ్లు అయినప్పటికీ తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. ఆయన అనుసరించే మార్గం మాకు తగినదన్నారు. ఆయన చిరస్మరణీయుడు అన్నారు.

తెలంగాణపై....

తెలంగాణపై తన అభిప్రాయాన్ని పార్టీ అధిష్టానానికి ఎప్పుడో చెప్పానని, వ్యక్తిగతంగా తన అభిప్రాయం ఏదైనప్పటికీ పార్టీ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని పురంధేశ్వరి చెప్పారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడతానన్నారు. కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని, పరిష్కారం కోసం ఈ నెల 28వ తేది వరకు సమయం ఉందన్నారు.

బాబుపై ధ్వజమెత్తిన లక్ష్మీ పార్వతి

ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రెండు కళ్ల సిద్ధాంతాన్ని ప్రజలు నమ్మడం లేదన్నారు. టిడిపి ఇవాళో రేపో ఆరిపోయే దీపం అన్నారు. ఎన్టీఆర్‌ను చంద్రబాబు ఇబ్బందులకు గురి చేశారని, అలాంటి నాయకుడు వెంట ఉండేందుకు సిగ్గుపడాలన్నారు.

చంద్రబాబు ఓసారి ఎన్టీఆర్ అధికారంలోకి తీసుకు వస్తే గద్దెనెక్కారని మరోసారి భారతీయ జనతా పార్టీ దయతో అధికారం చేపట్టారన్నారు. ఎన్టీఆర్ అందరివాడు అన్నారు. చంద్రబాబుకు ఎన్టీఆర్ శాపం తగిలిందని ఆమె మండిపడ్డారు.

English summary
Congress Party High Command studying Telangana issue said central minister Purandeswari on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X