వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జూనియర్ ఎన్టీఆర్ వెనక్కి: నారా లోకేష్‌కు ఊరట

By Pratap
|
Google Oneindia TeluguNews

Nara Lokesh - Jr Ntr
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో వారసత్వ పోరు నుంచి నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ వెనక్కి తగ్గినట్లు కనిపించడంతో పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్‌కు ఊరట లభించినట్లయింది. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని జూనియర్ ఎన్టీఆర్ శుక్రవారం స్వర్గీయ ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించిన సందర్భంలో చెప్పారు. తనకు అనుభవం లేదని, రాజకీయాల గురించి ఇప్పుడు ఆలోచన లేదని ఆయన అన్నారు. తాను సినిమాలపైనే దృష్టి పెట్టానని అన్నారు.

పైగా, చంద్రబాబు పాదయాత్రకు మద్దతు ప్రకటించారు. చంద్రబాబు పాదయాత్ర వల్ల పార్టీ బలం పెరుగుతుందని, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు. ఇదంతా చూస్తుంటే, ఇప్పటికిప్పుడు నారా లోకేష్‌తో తెలుగుదేశం పార్టీలో తలపడేందుగు జూనియర్ ఎన్టీఆర్ సిద్ధంగా లేరనేది అర్థమవుతోంది. గతంలో నారా లోకేష్ రాజకీయ రంగ ప్రవేశాన్ని తండ్రి హరికృష్ణతో కలిసి అడ్డుకోవడానికి ఎన్టీఆర్ ప్రయత్నించారనే ప్రచారం సాగింది.

చంద్రబాబు పాదయాత్రతో నారా లోకేష్‌కు వాతావరణం అనుకూలంగా మారినట్లు చెబుతున్నారు. పైగా, మామ, నందమూరి హీరో బాలకృష్ణ మద్దతు నారా లోకేష్‌కు పూర్తిగా ఉన్నట్లు అర్థమవుతోంది. బాలకృష్ణతో సమరానికి దిగేందుకు జూనియర్ ఎన్టీఆర్ సిద్ధంగా లేరని అంటున్నారు. అటువంటి వైరం పెట్టుకుంటే తన సినిమాలపై దెబ్బ పడుతుందని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. గతంలో ఎదురైన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని రాజకీయాల విషయంలో ఎన్టీఆర్ వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు.

కాగా, నారా లోకేష్ ఇటీవలి కాలంలో తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లో జోక్యం పెంచుకుంటున్నారు. చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నప్పటి నుంచి ఆయన పుంజుకుంటూ వస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలపై ట్విట్టర్ కామెంట్లు చేస్తూ, పార్టీ నాయకులకు సలహాలు ఇస్తూ ఆయన తెర వెనక క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల సంక్రాంతి పర్వదినానికి వెళ్లినప్పుడు తన జోరును కాస్తా పెంచారు. చంద్రగిరి నియోజకవర్గం కార్యకర్తలతోనే కాకుండా చిత్తూరు జిల్లాలోని ఇతర నియోజకవర్గాల కార్యకర్తలతోనూ ఆయన సమావేశమయ్యారు. పార్టీ ఇంచార్జీలను త్వరలో నియమిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇదంతా చూస్తుంటే, ఒక పద్ధతి ప్రకారం నారా లోకేష్ తెలుగుదేశం పార్టీలో నాయకత్వ స్థాయికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది.

చంద్రబాబు పాదయాత్ర చేస్తున్న ప్రస్తుత తరుణంలో బాలయ్య, నారా లోకేష్ హైదరాబాదు నుంచి పార్టీ వ్యవహారాలను పరిశీలిస్తున్నారు. విశాఖపట్నం ముఠా తగాదాపై బాలకృష్ణ వెంటనే స్పందించడం ఈ విషయాన్ని తెలియజేస్తోంది. నారా లోకేష్‌కు మార్గం సుగమం చేస్తూ తన పాత్రను పెంచుకుంటూ బాలకృష్ణ ముందుకు సాగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు.

English summary

 It is clear that Telugudesam party president N Chandrababu Naidu's son Nara Lokesh got relief, as Nandamuri hero Jr NTR has withdrawn from the party internal fight for the leadership.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X