• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమ్మాయిలకి కరాటే శిక్షణ: బాబు, తమ్ముళ్ల బాహాబాహీ

By Srinivas
|
Google Oneindia TeluguNews
Chandrababu Naidu
నల్గొండ/విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే యువతులకు కరాటేలో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చంద్రబాబు పాదయాత్ర నల్గొండ జిల్లాలో కొనసాగుతోంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు 17వ వర్ధంతి సందర్భంగా జిల్లాలోని కోదాడ మండలం ఖానాపూర్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన యుగపురుషుడు ఎన్టీఆర్ అన్నారు. రాజకీయాలపరంగా పెనుమార్పులు తీసుకు వచ్చారన్నారు. ఎన్టీఆర్ దెబ్బతో కాంగ్రెసు పార్టీ పరిస్థితి ప్రాంతీయ పార్టీగా మారిందన్నారు. జాతీయ పార్టీలను గడగడలాడించిన ఘతన ఎన్టీఆర్‌ది అన్నారు. ఎన్టీఆర్ అనివీతి పైన ఎప్పుడూ రాజీపడలేదన్నారు. ఎవరూ చేయలేని అభివృద్ధిని ఆయన చేసి చూపారన్నారు.

ఉన్నత ఆశయాల కోసం తన జీవితాన్నే ఫణంగా పెట్టారని, తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్‌ను ఎవరూ మర్చిపోలేరన్నారు. అవినీతిపై రాజీలేని పోరాటం సాగిస్తేనే ఎన్టీఆర్‌కు ఘనమైన నివాళి అన్నారు. పేదవారికి ఎనలేని సేవ చేసిన మహనీయుడు ఆయన అన్నారు. అనంతరం చంద్రబాబు పాదయాత్ర ఖానాపురం నుండి బయలుదేరింది. చంద్రబాబు కోదాడలోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో మాట్లాడారు.

టిడిపి అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగం, ఉపాధి కల్పిస్తామన్నారు. ఎపిపిఎస్సీలో సంస్కరణలు తీసుకు వస్తానన్నారు. యువతులకు కరాటేలో శిక్షణ ఇప్పిస్తానని చెప్పారు. అత్యాచారం చేస్తే పదిరోజుల్లోపు ఉరి తీయాలన్నారు. ఇంట్లో దొంగలు పడితే గగ్గోలు పెట్టే మనం దేశ సంపద దోపిడీకి గురైన స్పందించలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. యువతులకు కరాటేలో శిక్షణ ఇప్పిస్తామన్నారు. మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌దే అన్నారు. టిడిపి హయాంలో విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం వల్లే నేడు విదేశాల్లో మనవాళ్లు స్థిరపడ్డారన్నారు.

విశాఖలో తమ్ముళ్ల బాహాబాహీ

విశాఖ జిల్లా పెందుర్తిలో ఎన్టీఆర్ వర్ధంతి సభ శుక్రవారం రసాభాసగా మారింది. ఎన్టీఆర్ వర్ధంతి సభ వేదికగా తెలుగు తమ్ముళ్ల మధ్య ఘర్షణ జరిగింది. షీలా శ్రీనివాస రావు, బండారు సత్యనారాయణ మూర్తి వర్గీయల మధ్య ఘర్షణ జరిగింది. బండారు సత్యనారాయణ మూర్తి పైన షీలా అనుచరులు దాడికి దిగారు. బండారు వర్గం ఎదురు తిరగడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. స్థానిక నేతలు, పోలీసులు ఇరువర్గాల వారిని శాంతపర్చారు.

English summary
Telugudesam Party chief Nara Chandrababu Naidu has prased late Nandamuri Taraka Rama Rao on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X