వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనుమతి వద్దు: విగ్రహాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Supreme Court
న్యూఢిల్లీ: విగ్రహాల ఏర్పాటు పైన భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు శుక్రవారం సంచలన తీర్పు ఇచ్చింది. జాతీయ రహదారులు, జన సమ్మర్ధ ప్రాంతాలలో విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. జనం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, ప్రధాన రహదారులలో విగ్రహాలు నెలకొల్పేందుకు అనుమతి ఇచ్చి ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించింది.

విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇచ్చే ముందు ప్రభుత్వాన్ని ఈ విషయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. కేరళ రాష్ట్రానికి చెందిన ఓ న్యాయవాది పిటిషన్ పైన విచారించిన కోర్టు ఈ రోజు విగ్రహాల ఏర్పాట్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం బెంచ్ న్యాయమూర్తులు ఆర్ఎస్ లోధా, ఎస్‌జె ముఖోపాధ్యాయ శుక్రవారం ఈ ఆదేశాలు జారీ చేశారు.

కన్యాకుమారి జాతీయ రహదారిలోని ఓ ట్రాఫిక్ కూడలిలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఓ నేత విగ్రహాన్ని ఏర్పాటు చేసిందుకు అనుమతి ఇచ్చింది. దీనిపై ఓ న్యాయవాది సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయవద్దని ఆదేశించారు.

కేరళ ప్రభుత్వం రద్దీ ప్రాంతాల్లో, ప్రధాన రహదారులలో విగ్రహాల ఏర్పాటుకు, ఇతర కట్టడాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వవద్దని బెంచ్ ఆదేశించింది. ఇతర కట్టడాలకు అంటే ట్రాఫిక్ కోసం ఉపయోగపడే వీధి దీపాలు తదితర వాటికి తమ ఆదేశాలు వర్తించవని పేర్కొంది. తమ ఈ ఆదేశాలు కేరళ ప్రభుత్వానికే కాకుండా అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తిస్తుందన్నారు.

English summary
The Supreme Court has banned construction of statues or any other structure at public places which obstructs traffic movement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X