జైలుకు వెళ్లి జగన్‌కు దండం పెట్టాలి: చంద్రబాబు

Chandrababu Naidu
నల్లగొండ: మంచి పనిచేయాలంటే ఎవరైనా గుడికో, చర్చికో, మసీదుకో వెళ్తారని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాలంటే చంచల్‌గు-డాల జైలుకు వెళ్లాలని, అక్కడే దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించాలని, పక్కకు వెళ్లి సంచులు తెచ్చుకోవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ వాకిట్లో అవినీతి చెట్టు పెరిగిందని, అది పెరిగి పెద్ద ప్యాలెస్ అయిందని ఆయన అన్నారు.

అవినీతిపై పోరాటం చేయడం ద్వారానే మహానేత ఎన్టీఆర్‌కు నిజమైన నివాళి అర్పించగలమని అన్నారు. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని నల్లగొండ జిల్లా కోదాడ మండలంలో ఏర్పాటుచేసిన విగ్రహాలను ఆవిష్కరిస్తూ శుక్రవారం చంద్రబాబు పాదయాత్ర కొనసాగింది. కోదాడ పట్టణంలోని ఖమ్మం క్రాస్‌రోడ్, కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల, హరిజనవాడ, మార్కెట్ ఆఫీస్, బాలాజీనగర్ ప్రాంతాల మీదుగా 15 కిలోమీటర్లు నడిచారు.

చెప్పులు కుట్టే పల్లె వెంకటేశ్వర్లు చంద్రబాబుకు ప్రత్యేకంగా తయారుచేసిన చెప్పులను బహూకరించారు. జాతీయంగానూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ఏకపక్ష పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, చూడలేక తెలుగుదేశం పార్టీని స్థాపించి దేశ రాజకీయాల్లో పెనుమార్పులు తెచ్చిన ఘనత ఎన్టీఆర్‌దేనని ఆయన అన్నారు.

సంతకాలు పెట్టగానే జగన్ అవినీతి నీతిగా మారుతుందా అని చంద్రబాబు ప్రశ్నించారు. వైయస్ రాజశేఖర రెడ్డి దగ్గర పనిచేసిన శాఖ అధిపతులు, పెట్టుబడి పెట్టిన వ్యాపారులు జైలుకు వెళ్లారని, అప్పుడు దోపిడీ చేసిన మంత్రులు ఇప్పుడు దొరల్లా తిరుగుతున్నారని వైఎస్ పాలననుద్దేశించి చంద్రబాబు విరుచుకుపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+