వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాలిలో 45ని. చక్కర్లు: విమానంలో టి.సుబ్బిరామి రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Flight circles in Air for 45 minutes
చెన్నై/న్యూఢిల్లీ: వడగళ్ల వాన కారణంగా రన్ వే పైన మంచుగడ్డలు పడటంతో చెన్నై నుండి న్యూఢిల్లీకి బయలుదేరిన విమానం దాదాపు 45 నిమిషాలు గాలిలోనే చక్కర్లు కొట్టి ప్రయాణీకులను భయాందోళనకు గురి చేసింది. ఈ ఘటన శుక్రవారం జరిగింది. ఈ విమానంలో టి.సుబ్బిరామి రెడ్డి ఆయన సతీమణి కూడా ఉన్నారు. శుక్రవారం రాత్రి చెన్నై నుండి ఢిల్లీకి ప్రయివేటు విమానం ఒకటి బయలుదేరింది.

బయలుదేరే సమయానికి వాతావరణం బాగానే ఉంది. సన్నగా చినుకులు పడినా ఢిల్లీలో సైతం విమానం దిగేందుకు ఎలాంటి అవరోధం లేదన్న సంకేతాలు వచ్చాయి. కానీ, విమానం ఢిల్లీని సమీపిస్తున్నకొద్దీ వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. విమానాశ్రయంలో విమానం దిగేందుకు వీలులేనంతగా రన్‌వేలపై దట్టమైన మంచుగడ్డలు పడ్డాయి. నల్లటి మబ్బులతో పెద్ద పెద్ద వడగళ్ల వాన కురవడం వల్ల మంచుగడ్డలు పడ్డాయి.

దీంతో దాదాపు 45 నిమిషాల పాటు విమానం గాలిలోనే చక్కర్లు కొట్టాల్సివచ్చింది. విమానంలోని ప్రయాణీకులు భయానికి లోనయ్యారు. ఈ భయానక పరిస్థితి సుబ్బిరామి రెడ్డి కూడా ఎదుర్కొన్నారు. చక్కర్లు కొడుతున్న క్రమంలో ఓ దశలో విమానం నల్లటి దట్టమైన మేఘంలోకి కూడా వెళ్లిందట. ఆ తర్వాత అది కుదుపునకు గురైంది. 45 నిమిషాలు వారు ఆందోళనకు గురయ్యారు. అయితే పైలట్ చాకచక్యంతో విమానాన్ని రన్ వే మీదకు దించారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

English summary
A private flight rounded in air at New Delhi for 45 minutes on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X