అసద్‌కి మళ్లీ చుక్కెదురు: అక్బర్‌ది రేపటివరకు వెయిట్

అసదుద్దీన్ బెయిల్ పిటిషన్‌ను సంగారెడ్డి కోర్టు మంగళవారం మొదటిసారి కొట్టి వేసిన విషయం తెలిసిందే. 2005లో మెదక్ జిల్లా కలెక్టర్‌ను, జాయింట్ కలెక్టర్‌ను దూషించిన కేసులో అసద్ సోమవారం మెదక్ జిల్లా సంగారెడ్డి కోర్టులో లొంగిపోయారు. ఆ తర్వాత అతను కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దీనిని కోర్టు ఈ రోజు కొట్టేసింది.
2005లో మెదక్ జిల్లా కలెక్టర్ సింఘాల్‌ను, జాయింట్ కలెక్టర్‌ను దూషించిన కేసులో మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ సోమవారం సంగారెడ్డి కోర్టులో లొంగిపోయారు. ఈ కేసులో అసదుద్దీన్ ఇప్పటి వరకు పోలీసు రికార్డుల్లో పరారీలో ఉన్నట్లుగా చూపించారు. కోర్టు అతనికి ఫిబ్రవరి 2వ తేది వరకు రిమాండ్ విధించింది. అసద్ ప్రస్తుతం సంగారెడ్డి కోర్టులో ఉన్నారు.
2005లో పటాన్‌చెరు ముత్తంగి రోడ్డు విస్తరణలో భాగంగా ప్రార్థనా మందిరాన్ని తొలగించినందుకు యత్నించిన అధికారులను ఓవైసీ సోదరులు అడ్డుకున్నారని కేసు నమోదయింది. కలెక్టర్‌ను, జెసిని అక్బర్ దుర్భాషాలాడారు. వారిపై 163ఏ, 147, 149, 341 సెక్షన్ల క్రింద పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి అక్బర్ ఓసారి కోర్టుకు హాజరయ్యారు. ఆ తర్వాత హాజరు కాలేదు. అక్బర్ మరోసారి కోర్టుకు రాకపోవడంతో వారెంట్ పెండింగులో ఉంది. ఇప్పుడు వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అక్బరుద్దీన్ అరెస్టు కావడంతో పటాన్‌చెరు పోలీసులు పాత కేసును తిరగదోడారు.
అక్బర్ బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, సీనియర్ నేత అజీమ్ బెయిల్ పిటిషన్ పైన నిర్మల్ సెషన్స్ కోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications