బాబు, సురేఖ ఏమంటారు?: హరీష్, బెదరొద్దు: అరుణ

తెలంగాణ వస్తే విధ్వంసం సృష్టిస్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి అనడం విడ్డూరమన్నారు. ఆయన వ్యాఖ్యలను మాజీ మంత్రి, తెలంగాణ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కొండా సురేఖ సమర్థిస్తారా? లేఖ విభేదిస్తారా? చెప్పాలని డిమాండ్ చేశారు. గుర్నాథ్ వ్యాఖ్యలను సురేఖ వ్యతిరేకిస్తే వెంటనే ఆ పార్టీకి రాజీనామా చేయాలన్నారు. లేదా పార్టీ తెలంగాణకు అనుకూలమైతే గుర్నాథ్ రెడ్డిని సస్పెండ్ చేయాలన్నారు.
రావణకాష్టంగా...
కాంగ్రెసు పార్టీ కారణంగానే రాష్ట్రం రావణ కాష్టంలా తయారయిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కరీంనగర్ జిల్లాలో అన్నారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం తెలంగాణపై ఇరు ప్రాంత నేతలను ప్రోత్సహిస్తోందన్నారు. ఈ పరిస్థితికి కేంద్రమే కారణమని ఆయన దుయ్యబట్టారు.
సానుకూలమే
కేంద్రం, తమ పార్టీ అధిష్టానం తెలంగాణకు సానుకూలంగానే ఉందని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ నల్గొండ జిల్లా యాదగిరి గుట్టలో ఉన్నారు. తనకు మొక్కు ఉన్నందువల్లే లక్ష్మీ నరసింహ స్వామికి మొక్కుకునేందుకు వచ్చానన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పర్యటనకు వెళ్లే విషయం ఇంకా ఆలోచించలేదన్నారు.
ఎవరికీ బెదరొద్దు
తెలంగాణ విషయంలో కేంద్రం ఎవరికీ బెదరవద్దని మంత్రి డికె అరుణ అన్నారు. తెలంగాణకు అనుకూలంగా ప్రకటన వచ్చే సమయంలో సీమాంధ్ర నేతలు హెచ్చరించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కానీ అధిష్టానం, కేంద్రం బెదిరింపులకు లొంగవద్దన్నారు. 2009లో ప్రకటించిన తెలంగాణకు కట్టుబడి ఉండాల్సిందే అన్నారు.
బలగాలు మోహరించలేదు
తాము ఎక్కడా బలగాలను మోహరించలేదని డిజిపి దినేష్ రెడ్డి అన్నారు. ఎవరూ ప్రజలను భయాందోళనకు గురి చేయవద్దన్నారు. బాలల హక్కుల రక్షణ కోసం పోలీసు స్టేషన్‌లలో చైల్డ్ వెల్ఫేర్ అధికారులను నియమిస్తున్నట్లు చెప్పారు. ప్రాంతీయ విద్వేశాలు రెచ్చగొట్టేలా మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications