రాజ్‌నాథ్ ఏకగ్రీవం: అక్కడే రాహుల్‌కు బిజెపి కౌంటర్

Rajnath Singh - Rahul Gandhi
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడిగా రాజ్‌నాథ్ సింగ్ బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనకు పలువురు సీనియర్లు మద్దతు పలికారు. రాజ్‌నాథ్ 2015 వరకు అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. నితిన్ గడ్కరీ పదవీ కాలం పూర్తవడంతో మళ్లీ ఎన్నుకున్నారు. గడ్కరీయే రెండోసారి ఎన్నుకోబడతారని భావించినప్పటికీ చివరి నిమిషంలో ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో రాజ్‌నాథ్ వైపు అందరూ మొగ్గు చూపారు.

నూతన అధ్యక్షుడు రాజ్‌నాథ్‌కు సీనియర్ నేతలు లాల్ కృష్ణ అద్వానీ, నితిన్ గడ్కరీ, సుష్మా స్వరాజ్, వెంకయ్యనాయుడు, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తదితరులు అభినందనలు తెలియజేశారు. అంతకుముందు సింగ్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో నేతలు రాజ్‌నాథ్‌కు మద్దతు పలికారు. సీనియర్లు రాజ్‌నాథ్‌కు మిఠాయి తినిపించారు.

1951 జూలై 10 రాజ్‌నాథ్ ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి సమీపంలోని ఓ గ్రామంలో జన్మించారు. 1977లో శాసనసభకు ఎన్నికయ్యారు. 1988లో బిజెపి యువజన విభాగం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1991లో ఉత్తర ప్రదేశ్ విద్యామంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 1997లో యుపి రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా, 1999లో కేంద్రమంత్రిగా, 2000లో యుపి ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2002లో మళ్లీ కేంద్ర మంత్రి అయ్యారు. 2006లో ఓసారి పార్టీ అధ్యక్షుడిగా ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు.

సామాన్య కార్యకర్త మొదలు...

తాను సామాన్య కార్యకర్తగా బిజెపిలో చేరానని, అధ్యక్షుడి స్థాయికి ఎదిగానన్నారు. మరే పార్టీలోనూ ఇలాంటి అవకాశం రాదన్నారు. కేవలం బిజెపిలోనే ఇది సాధ్యమన్నారు. బిజెపిలో ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యత ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాజ్‌నాథ్ నేతృత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. తనపై వచ్చ వేయడం ద్వారా పార్టీని మలిన పర్చే కుట్ర జరిగిందన్నారు. నిన్న జరిగిన ఐటి దాడులు కూడా అందులో భాగమే అన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న వారికి సమాధానం చెప్పేందుకే రాజీనామా చేశానన్నారు. బిజెపిలో స్వచ్ఛమైన అంతర్గత స్వేచ్ఛ ఉందన్నారు. వారసత్వానికి దూరంగా ఉండే పార్టీ బిజెపి అన్నారు.

రెండేళ్లు కీలకం

2013 - 14 సంవత్సరం చాలా కీలకమని పార్టీ సీనియర్ నేత అధ్వానీ అన్నారు. ఎప్పుడైనా ఎన్నికలు జరుగవచ్చునని అన్నారు. ఈ రెండేళ్లు చాలా కీలకమన్నారు. చాలాకాలం నుండి బిజెపి నగరానికి చెందిన పార్టీగా ముద్రపడిందని కానీ, అది అవాస్తవం అన్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర గ్రామాల్లోకి వెళితే బిజెపి ఏమిటో తెలుస్తుందన్నారు. రాష్ట్రపతి భవన్‌లో శివరాజ్ సింగ్‌కు జరిగిన సన్మానమే ఇందుకు ఉదాహణ అన్నారు.

ప్రభుత్వ లెక్కల ప్రకారమే దేశంలో వ్యవసాయ వృద్ధిలో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉందన్నారు. నాలుగేళ్లుగా అవినీతిపై విస్తృతస్థాయిలో చర్చ జరుగుతోందన్నారు. ఇలాంటి సమయంలో ఎలాంటి మచ్చలేని రాజ్‌నాథ్ సింగ్ ఎన్నుకోబడ్డారన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న బిజెపి శ్రేణులు రాజ్‌నాథ్ సింగ్‌ను ఏకగ్రీవంగా ఎన్నికున్నాయన్నారు. దేశంలో పెద్దదైన యుపిలో పార్టీ పరిస్థితి ఇబ్బందిగా ఉందన్నారు. అలాంటి యుపిలో రాజ్‌నాథ్ పార్టీని బలోపేతం చేస్తారని అద్వానీ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా మౌలికాసదుపాయాల కల్పన ముఖ్యమని ఎన్డీయే భావిస్తోందన్నారు. అందులో ఎన్డీయే విజయం సాధిస్తోందన్నారు.

కాగా వారసత్వానికి దూరంగా ఉండే పార్టీ బిజెపి అని గడ్కరీ, బిజెపి అంటే ఏమిటో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర గ్రామాల్లోకి వెళితే బిజెపి ఏమిటో తెలుస్తుందని అద్వానీ అన్నారు. వీరి వ్యాఖ్యలు ఇటీవల జైపూర్ కాంగ్రెసు పార్టీ మేథోమధన సదస్సుకు కౌంటర్‌గా ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+