చీమూ నెత్తురు ఉంటే బయటకు రండి: కెసిఆర్

తెలంగాణలోని అన్ని స్థాయిల్లోని కాంగ్రెస్ నాయకులకు చీము, నెత్తురు ఉంటే ఇప్పటికైనా ఆ పార్టీ విషకౌగిలి నుంచి బయటకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ కాంగ్రెసు నేతలు తెలంగాణ ఉద్యమంలో కలిసి రావాలని, లేదంటే కాలగర్భంలో కలిసి పోతారని కెసిఆర్ అన్నారు.
కాంగ్రెస్ తంనంత తాను పెట్టుకున్న గడువును నిలబెట్టుకోకుండా తన విధానం నాన్చివేత అని మరోసారి నిరూపించుకుందని తెరాస శాసనసభ్యుడు కెటి రామారావు అన్నారు. నెలంటే ఎవరైనా 30 రోజులే అనుకుంటారని ఆయన అంటూ అది కాదంటే 365 రోజులా.. 3వేల రోజులా అని తెరాస నేత శ్రవణ్ ఎద్దేవా చేశారు.
ప్రత్యేక రాష్ట్రం కోసం ఢిల్లీ వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్‌నేతలు ఒట్టి చేతులతో హైదరాబాద్‌కు రావద్దని, వస్తే ప్రత్యేక రాష్ట్రంతోనే రావాలి, లేదా పదవులకు, పార్టీకి రాజీనామాలు చేయాలని తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు. తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు కేవీపీ, లగపాటి, రాయపాటి లాబీయింగ్ చేస్తున్నారని, వారి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు కేంద్ర నాయకత్వం తలొగ్గితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి ఇంకా సమయం ఉందంటూ గులాంనబీ ఆజాద్ బుధవారం చేసిన ప్రకటన తెలంగాణ ప్రజల గుండెలపై తన్నినట్టుందని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరాం వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలూ తెలంగాణకు అనుకూలంగా ఉంటామంటూ కేంద్రానికి చెప్పినా, సీమాంధ్రుల ప్రలోభాలకు లొంగి తెలంగాణ ప్రకటించడాన్ని నిలిపివేశారని విమర్శించారు.












Click it and Unblock the Notifications