జగన్‌ని సిఎం చేసేందుకే: కెవిపిపై యాష్కీ, కెసిఆర్ తప్పు

కెవిపి నాయకత్వంలో ముఠా బృందంగా వచ్చిన సీమాంధ్ర నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని పడగొడతామని బెదిరించిన ప్రభావమే కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ ప్రకటన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాది అన్నారు. ప్రకటనలు, సంకేతాలతో ప్రజలు సంతృప్తి చెందే పరిస్థితి లేదన్నారు. 2014లోపు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ జరగాల్సిందే అన్నారు. తెలంగాణ కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. తెలంగాణ నేతల అనైక్యతే దెబ్బతీసిందన్నారు.
కెసిఆర్‌ది తప్పు
వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి 100 ఎమ్మెల్యే, 15 ఎంపీ సీట్లు గెలిస్తే తెలంగాణ వస్తుందన్న ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో తాను విభేదిస్తున్నానని అన్నారు. జెండాలు, అజెండాలు పక్కన పెడితేనే తెలంగాణ తప్ప తెరాస ఎక్కువ సీట్లు గెలుస్తే తెలంగాణ రాదన్నారు. కాంగ్రెసు పార్టీని వీడి తెరాసలో చేరితే తెలంగాణ వస్తుందంటే ఇప్పుడే తామంతా చేరుతామన్నారు. కానీ అది తప్పన్నారు.
జాతీయ పార్టీలు అయిన బిజెపి, కాంగ్రెసుల ద్వారా మాత్రమే తెలంగాణ సాధ్యమన్నారు. సీమాంధ్ర నేతలు తాత్కాలికంగా వాయిదా వేయించినా తెలంగాణ సాధిస్తామన్నారు. తెరాసను బలోపేతం చేస్తే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. కానీ రాష్ట్ర ఏర్పాటు మాత్రం జరగదన్నారు. అందరూ కలిసి తెలంగాణ ఫ్రంట్‌గా ఏర్పడాలన్నారు. తెరాస ఎక్కువ సీట్లు గెలిచి కేంద్రాన్ని ఇబ్బంది పెట్టినా టిఎంసి డిఎంకెలు అడ్డుకుంటాయన్నారు.
వంద రోజుల సమ్మెకు సిద్ధం
కేంద్రం 28వ తేదిలోగా తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయకుండా వంద రోజుల సమ్మెకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
సుదర్సన్ రెడ్డి ఇంటి ముట్టడి
ఈ నెల 28వ తేదిలోగా తెలంగాణకు కేంద్రం అనుకూలంగా ప్రకటన చేసే విధంగా ఒత్తిడి తీసుకు రావాలంటూ మంత్రి సుదర్శన్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు ఓయు జెఏసి ప్రయత్నించింది. పోలీసులు వారిని అడ్డుకున్నారు.
ఆజాద్ వ్యాఖ్యలు సరికాదు
కేంద్రమంత్రి ఆజాద్ వ్యాఖ్యలు సరికాదని, ఆయన తెలంగాణను చులకన చేసేలా మాట్లాడారని యాదవ రెడ్డి, ఆమోస్ అన్నారు. ఆజాద్ వ్యాఖ్యల ద్వారా తెలంగాణ రాదేమోననే అభిప్రాయం ప్రజల్లో కలుగుతోందన్నారు. 28లోపు ప్రకటన చేస్తామని ప్రజల్లో నమ్మకం కలిగించాల్సిన బాధ్యత హోంమంత్రి పైన ఉందన్నారు. కాశ్మీరుకు తెలంగాణకు ముడిపెట్టడం మూర్ఖత్వమే అన్నారు. 28నే డెడ్ లైన్‌గా భావించవద్దన్నారు. ఆజాద్ జాగ్రత్తగా మాట్లాడితే బాగుండేదన్నారు. వారంలోపే కాంగ్రెసు నేతలు సమావేశం అయి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. లాబీయింగుతో కేంద్రంలో ఏమీ జరగదన్నారు.
సీట్ల గేమ్
కాంగ్రెసు పార్టీ సీట్ల గేమ్ ఆడుతోందని గద్దర్ అన్నారు. హైదరాబాద్ డాలర్ వంటిదని అందుకే సీమాంద్ర నేతలు వదులుకునేందుకు ఇష్టపడటం లేదన్నారు.
బిల్లు పెడితే మేం పాస్ చేయిస్తాం
వచ్చే పార్లమెంటు సమావేశాలలో కేంద్రం తెలంగాణ బిల్లు పెడితే పాస్ చేయించే బాధ్యత బిజెపిదేనని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణపై కాంగ్రెసుకు చిత్తశుద్ధి లేదన్నారు. ఇప్పటికైనా సోనియా పెదవి విప్పాలన్నారు. కేంద్రం బిల్లు పెడితే టిడిపి, కాంగ్రెసు ఎంపీలు ఓటు వేయకున్నా తాము పాస్ చేయిస్తామన్నారు. కాంగ్రెసు నేతల్లో ఐక్యత లేదని నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. తెలంగాణ వ్యతిరేకలపై విద్యార్థులు యుద్ధం ప్రకటించాలని, వ్యతిరేకులకే సోనియా అపాయింటుమెంటు ఇచ్చారని నాగం ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications