హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒత్తిడివల్ల కాదు: తెలంగాణపై జెసి, ఓపికపట్టమని దానం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Danam Nagender-JC Diwakar Reddy
హైదరాబాద్/చిత్తూరు: రాష్ట్ర విభజన దేశ సమగ్రత పైన ఆధారపడి ఉందని మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి గురువారం అన్నారు. ఎవరో ఒత్తిడి చేస్తే, లాబీయింగ్ చేస్తే కేంద్రం తెలంగాణపై తన ప్రకటన నిర్ణయాన్ని వాయిదా వేసుకోదన్నరు. ఒత్తిడి, లాబీయింగుల పైన తెలంగాణ నిర్ణయం ఆధారపడి లేదని అన్నారు. కేంద్రం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని విభజనపై నిర్ణయాన్ని వాయిదా వేసుకుందన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందని సీమాంధ్ర నేతలు కేంద్రాన్ని, అధిష్టానాన్ని హెచ్చరించలేదన్నారు. అలాంటి విషయమే ప్రస్తావించలేదన్నారు. కేవలం సీమాంధ్ర ప్రజల అభిప్రాయాన్ని మాత్రమే వారు పెద్దల దృష్టికి తీసుకు వెళ్లారన్నారు. ముఖ్యమంత్రి మార్పు పైనా ఆయన స్పందించారు. 2014 వరకు కిరణ్ కుమార్ రెడ్డే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని చెప్పారు.

సీమాంధ్రలో సమైక్యం

గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యల అనంతరం కూడా సీమాంధ్ర ప్రజల్లో తెలంగాణ విభజన భయంపోనట్లుగా కనిపిస్తోంది. సమైక్యాంధ్ర జెఏసి నేతలు పలుచోట్ల ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. కృష్ణా జిల్లా గుంటూరులో విద్యార్థులు తెలంగాణ వద్దు సమైక్యాంధ్ర ముద్దు అనే నినాదాలు చేస్తూ రహదారుల వెంబడి ర్యాలీలు నిర్వహించారు. నాటి అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం వృథా కనివ్వమన్నారు. తెలుగు తల్లిని ముక్కలు కానిచ్చేది లేదన్నారు. తిరుపతిలోనూ సమైక్య రాష్ట్రం కోసం ర్యాలీ నిర్వహించారు.

ఓపిక పట్టండి

తెలంగాణ ప్రజలు ఓపికపడితే కేంద్రం నుండి మంచి నిర్ణయం వస్తుందని కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ అన్నారు. రాజీనామాల విషయంలో ఎవరూ ఒత్తిడి తీసుకు రావాల్సిన అవసరం లేదన్నారు. కొద్ది రోజుల్లో ఇరు ప్రాంతాల ప్రజలకు అనుకూలమైన నిర్ణయం వస్తుందన్నారు.

English summary
Congress Party MLA and former minister JC Diwakar Reddy said on Thursday that No Seemandhra leaders pressure and lobbying behind Central Minister Ghulam Nabi Azad's statement against Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X