కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా!: టిడిపిని అడగండి.. ఆనం

Sridhar Krishna Reddy
నెల్లూరు: తెలంగాణ ప్రకటన మరింత ఆలస్యం కావచ్చునని కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ చెప్పినప్పటికీ సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం వేడి తగ్గడం లేదు. గురువారం పలు జిల్లాల్లో సమైక్యాంధ్ర ఐక్యకార్యాచరణ సమితి నేతలు రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే శ్రీధర కృష్ణా రెడ్డి ఇంటిని జెఏసి నేతలు ముట్టడించారు.

సమైక్యాంధ్ర కోసం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వారు సమైక్యాంధ్రకు, తెలుగు తల్లికి అనుకూలంగా నినాదాలు చేశారు. సమైక్యాంధ్ర జెఏసి ఇంటి ముట్టడితో బయటకు వచ్చిన శ్రీధర కృష్ణా రెడ్డి తాను సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నానని చెప్పారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రకటన రాకుంటే తాను రాజీనామా చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.

జెఏసి నేతలు డిమాండ్ చేయడంతో ఆయన తన రాజీనామా పత్రాన్ని వారికి అందించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు. తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు పంపిస్తానని చెప్పారు. తాను ఒకటి రెండు రోజుల్లో హైదరాబాదు వెళుతున్నానని, అక్కడ స్పీకర్‌ను స్వయంగా కలిస్తానని ఆయన చెప్పారు.

జెఏసి నేతలు ఆ తర్వాత మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలిశారు. తాము ఎప్పుడూ సమైక్యవాదులమేనని ఆనం అన్నారు. రాజమండ్రి సదస్సులో తాను పాల్గొంటానని చెప్పారు. తెలంగాణపై కేంద్రానికి అనుకూలంగా లేఖ ఇచ్చిన వారిపై సమైక్యాంధ్ర జెఏసి ఒత్తిడి తీసుకు రావాలని ఆయన సూచించారు. సమైక్యవాదంపై తమ అభిప్రాయాన్ని ఎప్పుడో కేంద్రానికి చెప్పామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+