తెలంగాణ నేతలపై ఆజాద్ అగ్గిమీదగుగ్గిలం: జెఏసి బంద్

వారి మాటలు విన్న ఆజాద్ వారి మీద అగ్గిమీద గుగ్గిలం అయ్యారట! మీ బాధలేవో మీరు పడండని, తెలంగాణపై ప్రకటన రాని పక్షంలో ప్రభుత్వం కూలినా ఫరవాలేదని, అవసరమైతే ముందస్తు ఎన్నికలకు వెళతామని తెలంగాణ ప్రాంత నేతలకు ఘాటుగానే చెప్పారనే గుసగుసలు ఢిల్లీలో వినిపిస్తున్నాయి. ఆజాద్ వ్యాఖ్యలతో వారు అసంతృప్తిగానే వెనుదిరిగారు. అయితే ఆ తర్వాత వారికి కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి వ్యాఖ్యలు సాంత్వన చేకూర్చాయి.
తెలంగాణ నేతలు ఎంపీ పొన్నం ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడకు వచ్చిన జైపాల్ రెడ్డి తెలంగాణపై అనుకూల ప్రకటన ఖాయమని, నిర్ణయం మాత్రం ఒకటి రెండు వారాలు వాయిదా పడిందని వారికి చెప్పారు. వారితో కలిసి జైపాల్ గ్రూప్ ఫోటో దిగారు. జైపాల్ నాయకత్వంలో తాము తెలంగాణ పోరాటానికి సన్నద్దం కావాలని వారు తీర్మానించారు.
తెలంగాణ వచ్చి తీరుతుందని, ఎవరైనా అడ్డుకోవడంవల్ల రాకపోతే యుద్ధానికి మనం సిద్ధంగా ఉండాలని జైపాల్ వారికి చెప్పారట. జైపాల్ ప్రత్యక్షంగా రంగంలో దిగినందువల్ల ఇక తెలంగాణ రాదనే భయం తమకు లేదని, ఆయన నాయకత్వంలోనే ఇరు ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రాంత నేతలు ధీమాతో ఉన్నారు.
ఆజాద్ వ్యాఖ్యలకు నిరసనగా బంద్
ఆజాద్ వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి తెలంగాణ విద్యాసంస్థల బందుకు పిలుపునిచ్చింది. బందుకు విద్యాసంస్థలు, న్యాయవాదులు, పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి.












Click it and Unblock the Notifications