మజ్లీస్ నేతలపై కేసుల కొరడా: కిరణ్ రెడ్డి ఆదేశం

Owaisi Brothers
హైదరాబాద్: మజ్లీస్ నేతలపై కేసుల కొరడాలు ఝళింపిచాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి. పెండింగులో ఉన్న నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ల దుమ్ము దులిపి, మజ్లీస్ శానససభ్యులపై, కార్పోరేటర్లపై చర్యలు తీసుకోవాలని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాదు పోలీసులను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. రెండు వేర్వేరు కోర్టులు ఓవైసీ సోదరుల బెయిల్ దరఖాస్తులను తిరస్కరించిన నేపథ్యంలో మజ్లీస్ నేతలపై పెండింగులో ఉన్న క్రిమినల్ కేసులను బయటకు తీస్తున్నారు.

మజ్లీస్ నేతలపై ఉన్న కేసుల జాబితాతో పాటు ఎవరెవరిపై పెండింగులో ఉన్న నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ల జాబితాను తయారు చేయాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ జోనల్ డిసిపిలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన ఓ సర్క్యులర్ జారీ చేశారు.

మజ్లీస్ నేతలపై ఉన్న కేసుల వివరాలను అదనపు పోలీసు కమిషనర్ (క్రైమ్స్) సందీప్ శాండిల్యకు సమర్పించాలని కూడా ఆయన ఆదేశించారు. ఇప్పటి వరకు పోలీసులు సేకరించిన సమాచారం ప్రకారం 20 మంది మజ్లీస్ నేతలపై కేసులున్నట్లు, ఓ మజ్లీస్ శాసనసభ్యుడిపైనా ఐదుగురు కార్పోరేటర్లపైనా నాన్ బెయిలబుల్ అరెసటు వారంట్లు పెండింగులో ఉన్నట్లు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక రాసింది.

మిలాద ఉన్ నబీ (ప్రవక్త జయంతి) తర్వాత ఆ నేతలపై చర్యలకు పూనుకుంటామని పోలీసు వర్గాలు చెప్పినట్లు ఆ పత్రిక రాసింది. కొంత మంది బిజెపి, తెలుగుదేశం పారటీ కార్పోరేటర్లపై కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయని, నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్లు కూడా పెండింగులో ఉన్నాయని, వాటిపై చర్యలకు పోలీసు కమిషనర్ శర్మ ఏ విధమైన ఆదేశాలూ ఇవ్వలేదని ఆ పత్రిక తెలిపింది.

శాసనసభ్యుడు అహ్మద్ పాషా ఖాద్రీపైనే కాకుండా అహ్మద్ బలాలా, ముంతాజ్ ఖాన్, అఫ్సర్ ఖాన్, మౌజం ఖాన్, విరాసత్ రసూల్ ఖాన్, మేయర్ మొహ్మద్ మజీద్ హుస్సేన్‌లపై కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయి.

వారిపై పటాన్‌చెరు కేసుతో పాటు డేనిష కార్టూన్ సంబంధమైన కేసు, బంగ్లాదేశీ రచయిత్ర తస్లీమా నస్రీన్‌పై దేడు కేసు, సిపిఎం ఎంపి మధుపై దాడి కేసు, నీలోఫర్ ఆస్పత్రి వైద్యులపై దాడి కేసు ఉన్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+