బాబు ఆదేశిస్తే పరిటాల శ్రీరామ్ పోటీ: తల్లి సునీత

Paritala Sriram - Sunitha
అనంతరం: తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే తన కుమారుడు పరిటాల శ్రీరామ్ ఎన్నికల్లో పోటీ చేస్తాడని తెలుగుదేశం పార్టీ శానససభ్యురాలు పరిటాల సునీత చెప్పారు. మాదీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత పరిటాల రవి ఎనిమిదో వర్ధంతి సందర్భంగా గురువారంనాడు అనంతపురం జిల్లా వెంకటాపురంలోని పరిటాల ఘాట్ వద్ద ఆయన సతీమణి, కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు.

పరిటాల రవికి నివాళ్లు అర్పించిన సందర్భంగా సునీత మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశిస్తే 2014 ఎన్నికల్లో శ్రీరామ్ పోటీ చేస్తారన్నారు. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న శ్రీరామ్‌ను కాంగ్రెస్ నేతలు కుట్రలు పన్ని కేసులో ఇరికించారని సునీత ఆరోపించారు.

పరిటాల శ్రీరామ్ రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం ముమ్మరమైన నేపథ్యంలో కేసులో ఇరుక్కున్నారు. కాంగ్రెసు నాయకుడు సుధాకర్ రెడ్డి హత్యకు కుట్ర చేశారని ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్ మంజూరైంది. బెయిల్ వచ్చిన తర్వాత ఆయన అజ్ఝాతం వీడి కోర్టులో లొంగిపోయారు.

ఆ తర్వాత విదేశాలకు వెళ్లేందుకు కూడా అనంతపురం జిల్లా ధర్మవరం కోర్టు శ్రీరామ్‌కు అనుమతి ఇచ్చింది. విద్యాభ్యాసానికి గాను విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+