ఢిల్లీ గ్యాంగ్ రేప్ విక్టిమ్‌కి 73 శాతం మార్కులు

Delhi Braveheart scores 73% in exams, proves her dedication
న్యూఢిల్లీ: కెరీర్‌లో పైకెదిగి తన ఇద్దరు సోదరులకు మంచి విద్యను అందించాలని ఆమె కలలు కన్నది. అయితే, ఆమె కలలు ఆ 23 ఏళ్ల పారా మెడికల్ విద్యార్థిని స్వప్నం డిసెంబర్ 16వ తేదీన బద్దలైంది. ఢిల్లీలోని బస్సులో ఆమె ఆరుగురు వ్యక్తుల చేత సామూహిక అత్యాచారానికి గురై, అసువులు బాసింది. ప్రాణాలతో 13 రోజుల పాటు పోరాటం చేసి చివరికి డిసెంబర్ 29వ తేదీన సింగపూర్ ఆస్పత్రిలో మరణించింది.

ఆ పారా మెడికల్ విద్యార్థినిపై జరిగిన దౌష్ట్యం దేశాన్ని ఊపేసింది. అత్యాచారం చేసిన వ్యక్తులకు కఠిన శిక్ష విధించాలని ఢిల్లీలో నిరసనలు వెల్లువెత్తాయి. జీవితంపై ఎనలేని ఆశతో కఠిన శ్రమ చేస్తూ అంకిత భావంతో తన కెరీర్‌ను రూపుదిద్దుకోవడానికి ఆమె పడిన తపనను ఆమె తల్లిదండ్రులు, సోదరులు గుర్తు చేసుకుంటున్నారు.

ఆమె అంకిత భావానికి జనవరి 23వ తేదీన విడుదలైన పరీక్షా ఫలితాలు అద్దం పడుతున్నాయి. ఫిజియోథెరపి బ్యాచిలర కోర్సు నాలుగో సంవత్సరం పరీక్షల్లో ఆమెకు 72.7 శాతం మార్కులు వచ్చాయి. ఆమె మరణించిన నెలలోగానే ఉత్తరాఖండ్‌లోని హేమవతి బహుగుణ గర్వాల్ విశ్వవిద్యాలయం పరీక్షా ఫలితాలు వెల్లడించింది.

ఆమెకు 1100 మార్కులకు గాను 800 మార్కులు వచ్చాయని డెహ్రాడూన్ సంస్థ డైరెక్టర్ చెప్పారు. ఇక్కడే ఆమె ఫిజియోథెరపీ కోర్సు అభ్యసించింది. సబ్జెక్టుల్లో ఆమె ప్రతిభ అసాధారణమైందని ఆయన అన్నారు. ఆమెకు లభించిన మార్కుల పట్ల ఆమె కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ సమయంలో ఆమె లేకపోవడం వారికి విషాదాన్ని మిగిల్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+