వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ పార్టీ బలంగా ఉంది, కష్టాల్లో ఉంది నిజమే: అసద్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Asaduddin Owaisi
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలంగా ఉందని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ శుక్రవారం అన్నారు. ప్రస్తుతం మజ్లిస్ పార్టీ కష్టాల్లో ఉన్న మాట వాస్తవమే అన్నారు. అయినప్పటికీ పార్టీ కార్యకర్తలు ఎలాంటి నిరాశ నిస్పృహలకు లోను కావొద్దని సూచించారు.

వచ్చే నెలలో తాను రాష్ట్రవ్యాప్తంగా జోరుగా పర్యటిస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీకి గట్టి బుద్ధి చెబుతామన్నారు. 2014లో కాంగ్రెసుకు రాష్ట్రంలో నలబై సీట్లు కూడా రావన్నారు. గురువారం అర్ధరాత్రి ఈద్‌లో పాల్గొన్న అసద్ మాట్లాడుతూ.. తాము హిందువులకు వ్యతిరేకం కాదన్నారు. హిందువులతో ఎలాంటి శతృత్వం లేదన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ఎట్టి పరిస్థితుల్లో ప్రధానమంత్రిని కానిచ్చేది లేదన్నారు.

తాము బిజెపి, ఆర్ఎస్ఎస్‌లకు మాత్రమే వ్యతిరేకమని, హిందువులకు కాదన్నారు. మేమెంటో 80 లక్షల ముస్లింలకు తెలుసు అన్నారు. వచ్చే ఎన్నికల్లో తమను గెలిపిస్తారన్నారు. కాంగ్రెసు పార్టీ తమను ఉద్దేశ్య పూర్వకంగా వేధిస్తోందన్నారు. ఇక ముందు రాష్ట్రంలో కాంగ్రెసు ఎప్పుడూ అధికారంలోకి రాదన్నారు. మా తడాఖా ఏమిటో 2014లో చూపిస్తామన్నారు. ప్రజలు కూడా అందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

కాంగ్రెసు ప్రభుత్వ హయాంలో మైనార్టీలకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తామన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోసు, డాక్టర్ బిఆర్ అంబేడ్కర్‌లు గొప్ప నేతలు అన్నారు. గాజులు తొడుక్కొని పాలన చేయడం తెలియదని అసదుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన మండిపడ్డారు.

పాతబస్తీలో బందోబస్తు

మిలాద్ ఉన్ నబీ, శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో పాతబస్తీలో సున్నిత ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముస్లింలు మక్కా మసీదు నుండి మొగల్ పురా వరకు ర్యాలీని చేపట్టారు. ఓ సమయంలో ముస్లింలు చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి గుడి వద్దకు చొచ్చుకు వచ్చే ప్రయత్నాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు.

English summary

 Hyderabad MP and MIM chief Asaduddin Owaisi said on Friday that YS Jaganmohan Reddy's YSR Congress party is very strong in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X