పాక్ జైలులో భారత ఖైదీ మృతి: కొట్టడం వల్లనే

మీడియా కథనాల ప్రకారం - నల్లా నీళ్లతో దుస్తులు ఉతుక్కున్నందుకు చమేల్ సింగ్‌ను జైలు సిబ్బంది తీవ్రంగా కొట్టారని, ఈ సంఘటన జనవరి 15వ తేదీన జరిగిందని, ఆ తర్వాత రెండు రోజులకు జిన్నా ఆస్పత్రిలో అతను మరణించాడని న్యాయవాది చెప్పాడు.
సింగ్‌ను నిర్దయగా కొట్టారని, మైనారిటీలను దుర్భాషలాడారని ఖాన్ చెప్పాడు. చమేల్ సింగ్ మృతి విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేయాలని పాకిస్తాన్ అధికారులు భారత్‌కు తెలిపారు. ఈ విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు తెలిపారు.
సింగ్ మృతదేహాన్ని భారత్‌కు పంపించాలా, పాకిస్తాన్‌లోనే అతని మృతదేహానికి అంత్యక్రియలు చేయాలా అనే విషయంపై ఆయన కుటుంబ సభ్యుల నుంచి జవాబు కోసం ఎదురు చూస్తున్నారు. జైలులో చమేల్ సింగ్‌ను కొట్టినట్లు తమకు ఏ విధమైన సమాచారం లేదని భారత అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications