హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెటిఆర్, స్వామిగౌడ్ అరెస్ట్: వైయస్ విగ్రహానికి నిప్పు

By Srinivas
|
Google Oneindia TeluguNews

KT Rama Rao-Swamy Goud
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చేపట్టిన సమర దీక్ష ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. ఇందిరాపార్కు వద్ద సమర దీక్ష చేస్తామని ఐకాస చైర్మన్ కోదండరామ్ ప్రకటించారు. అయితే అక్కడకు తెలంగాణవాదులు ఎవరూ రాకుండా పోలీసులు ఎక్కడికి అక్కడ అడ్డుకుంటున్నారు. ఇందిరాపార్కు వద్ద, హైదారాబాదులో భారీగా పోలీసులను మోహరించారు. నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుండి ఎవరు రాజధానికి రాకుండా పోలీసులు ఎక్కడికి అక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. పలు జిల్లాల్లో తెలంగాణవాదులను ముందస్తుగా అరెస్టు చేశారు.

ఉండవల్లి మాటలు పట్టించుకోవద్దు

రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ మాటలను తెలంగాణవాదులం పట్టించుకోవాల్సిన అవసరం లేదని కోదండరామ్ అన్నారు. తెలంగాణవాదులు వాటిని సీరియస్‌గా తీసుకోవద్దు అన్నారు. ఈ నెల 28వ తేదీలోగా తెలంగాణపై ప్రకటన రాకుంటే అంతర్గతంగా చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. పోలీసుల ఇందిరాపార్కు వద్ద దీక్ష అడ్డుకుంటే ఎక్కడైనా జరిపితీరుతామన్నారు.

ఎక్కడ ఎలా అనేది మీరే చూస్తారన్నారు. రాజకీయ పరిష్కారాన్ని శాంతిభద్రతల కోణంలో చూడవద్దన్నారు. ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా కేంద్రం తీరు ఉందని మండిపడ్డారు. కేంద్రం తీరు అంతుపట్టడం లేదని, ఏదో అంతుచిక్కని వైష్ణవమాయలా ఉందన్నారు. సమర దీక్ష తర్వాత చలో హైదరాబాద్ ఉంటుందని చెప్పారు.

స్వామి గౌడ్, కెటిఆర్ అరెస్టు

అసెంబ్లీలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత స్వామి గౌడ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తెరాస ఎమ్మెల్యే కెటిఆర్‌ను న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారిని కంచన్ బాగ్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. తెరాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలువురు తెరాస భవన్‌కు చేరుకున్నారు. తెలంగాణవాదుల ఆందోళనతో హైదరాబాదులో టెన్షన్ టెన్షన్‌గా ఉంది. అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన హరీష్ రావు, ఇతర ఎమ్మెల్యేలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వరంగల్లో వైయస్ విగ్రహానికి నిప్పు

వరంగల్ జిల్లాలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో పోలీసులు విగ్రహం చుట్టు ఇనుము ముళ్ల కంచె వేశారు.

English summary
TRS MLAs K Taraka Rama Rao and Harish Rao, former TNGO leader Swamy Goud were arrested by Hyderabad police on Sunday morning near Assembly premises.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X