తెలంగాణపై ఇంచార్జ్ ఆజాద్: కేంద్రప్రకటనగానే చూస్తారా?

Ghulam Nabi Azad
న్యూఢిల్లీ: రాష్ట్రంలో మరోసారి తెలంగాణ వేడి రాజుకుంది. మూడు రోజులుగా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కోర్ కమిటీ సభ్యులతో తెలంగాణ అంశంపై తీవ్రంగా చర్చిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో కోర్ కమిటీ మరోసారి భేటీ అయింది. భేటీ అనంతరం కేంద్రమంత్రి, ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ మీడియాతో తెలంగాణపై కీలక ప్రకటన చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఈ నేపథ్యంలో ఆజాద్ ఏం ప్రకటన చేస్తారు? తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తారా? అభివృద్ధి మండలి అంటారా? హైదరాబాదును ఏం చేస్తారు? తదితర అంశాలపై అందరిలోనూ ఉత్కంఠను రేపుతోంది. అదే సమయంలో ఆజాద్ చేసే ప్రకటనను తెలంగాణవాదులు అయినా సమైక్యాంధ్రవాదులు అయినా కేంద్ర ప్రకటనగా చూస్తారా? అనే చర్చ కూడా సాగుతోంది.

ఆజాద్ ఏ ప్రకటన చేసినా ఆయన పార్టీ రాష్ట్ర ఇంచార్జిగానే చేస్తారని అంటున్నారు. ఆయన చేసే ప్రకటన కేంద్ర ప్రభుత్వం ప్రకటనగా కాకపోవచ్చునని అంటున్నారు. అందుకు నాలుగు రోజుల క్రితం ఆయన చేసిన ప్రకటనను ఉదహరిస్తున్నారు. షిండే నెల రోజులు గడువు చెప్పినప్పటికీ బుధవారం ఆజాద్ మాట్లాడుతూ... నెల అంటే నెల కాదని అన్నారు. కానీ, ఆ తర్వాత కేంద్రం తెలంగాణపై తీవ్రస్థాయిలో చర్చించి ఓ నిర్ణయాన్ని చెప్పాలనే అభిప్రాయానికి వచ్చింది.

అప్పుడు ఆజాద్ చేసిన ప్రకటన కేవలం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగానే చూశారు. ఇప్పుడు కూడా ఆజాద్ ప్రకటన చేస్తే అలాగే చూసే అవకాశాలు ఉంటాయన్నారు. అయితే ఆయన ప్రకటన అధికారం కూడా కావచ్చంటున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిగానే ఆయన ఈ రోజు ప్రకటన చేయవచ్చునని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+