వైయస్‌తోనే ప్రారంభం: బాబు, ఒత్తిడితో యాత్రకు బ్రేక్!

Chandrababu Naidu
విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అవినీతి నిర్మూలనకు ప్రత్యేక చట్టం తీసుకు వస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శనివారం అన్నారు. కృష్ణా జిల్లాలో బాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలుచోట్ల ఆయన మాట్లాడారు. టిడిపి అధికారంలోకి వస్తే అవినీతి, అక్రమాలపై విచారణ కోరే అధికారం ప్రజలకు ఇస్తామన్నారు. అవినీతి కేసుల కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామన్నారు.

నిజాయితీ ఉన్న వారిని న్యాయమూర్తులుగా నియమిస్తామని హామీ ఇచ్చారు. మార్పు దిశగా గాలి వీస్తోందన్నారు. తొమ్మిదేళ్లుగా రాష్ట్ర పరిపాలనా వ్యవస్థను కారుమబ్బులు కమ్ముకున్నాయని, పారిశ్రామిక ఆర్థిక ప్రగతి నిర్వీర్యమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిణామాల రీత్యా ప్రభుత్వం మార్పు దిశగా గాలులు వీస్తున్నాయని, పాదయాత్రకు లభిస్తున్న విశేష స్పందనే ఇందుకు సాక్ష్యమని వ్యాఖ్యానించారు.

గడిచిన తొమ్మిదేళ్ల రాష్ట్ర పరిపాలనా కాలాన్ని ముందుతరాల చర్రితకారులు అవినీతి స్వర్ణయుగంగా అభివర్ణిస్తారనడంలో ఏ మాత్రం సందేహాం లేదని చెప్పారు. 2004లో దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి పాలనాపగ్గాలు చేపట్టడంతో ఈ యుగం మొదలైందని విమర్శించారు. అవినీతి మహమ్మారి రాష్ట్రంలోని వ్యవస్థలన్నీంటిని నిర్వీర్యం చేసిందని, ఆర్థిక సామాజిక అసమానతలు విపరీతంగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.

అత్యున్నతస్థాయిలో అవినీతిని నిర్మూలిస్తే అట్టడుగున ఉన్న అవినీతి తనంతట తానే మాయమవుతుందని అభిప్రాయపడ్డారు. అవినీతికి పాల్పడితే తమను అడిగేవారెవరని అగ్రస్థానంలో ఉన్న నేతలు విశ్వసిస్తున్నందున ఈ దుస్థితి దాపురించిందని వివరించారు. అధికారంలోకి వస్తే ఈ పరిస్థితి మారుస్తానని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు జరిగిన అవినీతిని, ప్రజాధనం లూటీని వెలికితీసి అక్రమాలకు పాల్పడినవారు ఎంతటివారైనా, ఏ పార్టీకి చెందినవారైనా కఠిన చర్యలు తీసుకుంటామని, అవినీతి నిరోధక చట్టాన్ని అమలులోకి తెస్తామని తెలిపారు.

యాత్రకు ఒకరోజు విరామం

పాదయాత్ర 117వ రోజు నేపథ్యంలో, పరిటాల గ్రామంలో ఏర్పాటు చేసిన పైలాన్ ప్రారంభోత్సవం, బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబును విశ్రాంతి తీసుకోవాలని తెలుగు తమ్ముళ్లు కోరారు. మొదట ససేమీరా అన్న బాబు చివరకు వెనక్కి తగ్గారు. వైద్య పరీక్షల కోసం ఒక్కరోజు విశ్రాంతి తీసుకుంటున్నట్టు ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+