వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టార్గెట్ బిఎస్పీ: తాజ్‌మహల్‌పై అజంఖాన్ 'మాయా'జాలం

By Srinivas
|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తర ప్రదేశ్ మంత్రి అజం ఖాన్ మూడు రోజుల క్రితం తాజ్ మహల్ పైన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆ వ్యాఖ్యల్ని మాజీ ముఖ్యమంత్రి, బహుజన సమాజ్ పార్టీ(బిఎస్పీ) అధ్యక్షురాలు మాయావతిని ఉద్దేశించి చేసినవి మాత్రమే! బిఎస్పీ అధికారంలో ఉన్న సమయంలో ఆమె తన విగ్రహాల కోసం, బిఎస్పీ గుర్తు అయిన ఏనుగు బొమ్మల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.

ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షాలు కూడళ్లలో పెద్దమొత్తంలో స్థాపిస్తున్న, స్థాపించిన బిఎస్బీ పార్టీ గుర్తులపై నిప్పులు చెరిగేవారు. నిబంధనలకు విరుద్ధంగా ఆమె విగ్రహాలు స్థాపిస్తున్నారని మండిపడేవారు. అజం ఖాన్ మాయావతి ఇష్టారీతిగా విగ్రహాలు పెట్టడాన్ని ఉద్దేశించే తాజ్ మహల్ పైన ఇప్పుడు ఇలా వ్యాఖ్యలు చేసి ఉంటారని అంటున్నారు. అందుకే కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు పెట్టి తాజ్ మహల్ కట్టడాన్ని నిర్మించడమేమిటని ఆయన వ్యాఖ్యానించారు!

కాగా అజం ఖాన్ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ముజఫర్ నగర్‌లో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా ఎంపి జయప్రద ప్రత్యర్థి అయిన అజం ఖాన్ అందర్నీ ఆశ్చర్యపర్చే వ్యాఖ్యలు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లో మత ఘర్షణలు చెలరేగినప్పుడు కొందరు బాబ్రీ మసీదును కూల్చివేశారని కానీ, తాజ్ మహల్ కూల్చుతానంటే తానే ముందుండి వారిని నడిపించేవాడినని అన్నారు.

Target Mayawati: Azam Khan on Taj Mahal

నాటి బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన తనను ఎంతగానో బాధించిందని ఆయన అన్నారు. అదే సమయంలో ఆయన మాట్లాడుతూ... షాజాహాన్ తన భార్య ముంతాజ్‌కు గుర్తుగా తాజ్ మహల్ కట్టించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల సొమ్మును షాజాహాన్ తన ప్రేయసికి గుర్తుగా కట్టిన తాజ్ మహల్ కోసం వినియోగించడం సరికాదన్నారు. తాజ్ మహల్ కూల్చడానికి ముందుకు వచ్చి ఉంటే తానే వారిని నడిపించేవాడినని అన్నారు.

అదే రోజు అంతకుముందు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తాజ్ మహల్ అందాల గురించి పొగిడారు. జాయ్‌పీ ప్యాలెస్‌లో విదేశీ అతిథులకు తాజ్‌మహల్ గొప్పతనాన్ని అఖిలేష్ వివరించారు. మంత్రి ఆజం ఖాన్ మాత్రం తాజ్ మహల్ కట్టడంపై తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజల సొమ్ముతో కట్టిన తాజ్ మహల్‌ను కూల్చివేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. తాజ్ మహల్‌ను ప్రేమకు ప్రతిరూపంగా భావిస్తుంటారు.

English summary
Senior Samajwadi Party (SP) leader and minister in Akhilesh cabinet Mohammed Azam Khan has once again created a flutter saying had the mob that razed the BabriMasjid in Ayodhya targeted the TajMahal instead, he would have led them to demolish the monument.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X