వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సింగపూర్‌లాంటివి పది కట్టుకోవచ్చు: ఆంధ్రకు పేర్వారం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pervaram Ramulu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోతే సింగపూర్ లాంటి నగరాలని పదింటిని కట్టుకోవచ్చునని మాజీ డిజిపి, తెలంగాణ రాష్ట్ర సమితి నేత పేర్వారం రాములు గురువారం అన్నారు. సీమాంధ్ర నేతలు తమ ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాల్సింది పోయి పక్క వారిని దోచుకోవడమేమిటని ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోతే ఆంధ్రలో సింగపూర్ లాంటి సిటీలను పదింటిని అక్కడ నిర్మించుకోవచ్చునని సూచించారు.

డిసెంబర్ 23 ప్రకటన తర్వాత కేంద్రం తెలంగాణపై వెనక్కి తగ్గిందనే అభిప్రాయంతోనే తెలంగాణలో ఆత్మహత్యలు పెరిగాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఆత్మహత్యలకు కేంద్రం ప్రకటనే కారణమని ఆరోపించారు. కాంగ్రెసు వార్ కమిటీ ఓ బోర్ కమిటీ అని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రాంత మంత్రులు తెలంగాణ కోసం జరుగుతున్న ఉద్యమంలో కనీసం సి గ్రేడులో కూడా లేరని విమర్శించారు.

తెలంగాణ ఇస్తే ఆంధ్ర ప్రాంతానికి ఎలాంటి నష్టం జరగదన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన కేసులు పెడితే అవి కోర్టులలో నిలువవని చెప్పారు. రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ పైన కేసులు పెడితే నిలుస్తాయన్నారు.

మాజీ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ కుటుంబం పైన అసత్యాలు చెప్పాలని కెసిఆర్ ఉద్దేశ్యం కాదన్నారు. ఆయన ఎవరినీ కించపర్చలేదన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెసు ద్రోహానికి బలవుతున్నారనే ఆయన ఆవేదన అన్నారు. నెహ్రూ కుటుంబాన్ని విమర్శిస్తే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర నేతలే ఎక్కువగా బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు.

English summary
Former DGP Pervaram Ramulu has suggested Andhra leaders on state bifurcation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X