వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సహకార ఎన్నికలు: జగన్ థర్డ్ ప్లేస్, కాంగ్రెసు పైచేయి

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy - YS Jagan
హైదరాబాద్: సహకార సంఘాల మొదటిదశ ఎన్నికల్లో కాంగ్రెసు పైచేయి సాధించగా, తెలుగుదేశం పార్టీ రెండో స్థానంలో నిలిచింది. వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరా)కి ఎన్నికలు నిరాశనే కలిగించాయి. తెలుగుదేశం పార్టీ మూడు జిల్లాల్లోనే పూర్తిస్థాయి ఆధిక్యం చూపించింది. మొత్తమ్మీద చూస్తే మాత్రం, నాలుగో వంతుకు పైగానే డైరెక్టర్ల స్థానాలను సొంతం చేసుకోగలిగింది.

తొలిదశ ఎన్నికల్లో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా తొలివిడతగా ఏకగ్రీవాలు, ఎన్నికలు అయినవి కలిపి 1365 పీఏసీఎస్‌లు ఉన్నాయి. వీటిలో గురువారం రాత్రికి అందిన సమాచారం ప్రకారం మొత్తం మీద ప్రతిపక్షాల కంటే కాంగ్రెస్ పార్టీయే మెరుగైన ఫలితాలు సాధించింది. తెలిసిన సమాచారం మేరకు కాంగ్రెస్‌కు 595 స్థానాలు (43.5%) దక్కగా. తెలుగదేశం పార్టీకి 349 (25.56%) దక్కాయి. వైయస్సార్ కాంగ్రెసు కేవలం 218 (15.97%) స్థానాలు దక్కించుకోగలిగింది. తెరాస ఒక్క జిల్లాలో ఆధిక్యత నిలుపుకొని, మొత్తమ్మీద 61 స్థానాలు దక్కించుకోగలిగింది.

అయితే తొలివిడతలో మొత్తం 1437 పీఏసీఎస్‌లను సహకార శాఖ నోటిఫై చేసి, అందులో 72 సొసైటీల ఎన్నికలను వాయిదా వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వీటిలోనూ ఎన్నికలు జరిగితే అత్యధిక శాతం ప్రతిపక్షాలు దక్కించుకునేవని చెబుతున్నారు. మొత్తం 22 జిల్లాల్లో సహకార ఎన్నికలు జరిగాయి. వాటిలో 15 జిల్లాల్లో కాంగ్రెస్, మూడేసి జిల్లాల్లో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు, ఒక జిల్లాలో తెరాస ఆధిక్యం కనబరిచాయి.

మెదక్ జిల్లా మాత్రం తెరాసకు దక్కింది. కృష్ణా, గుంటూరు, ఖమ్మం జిల్లాల్లో తెలుగుదేశం స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. గోదావరి జిల్లాలు, ప్రకాశం, రంగారెడ్డి జిల్లాల్లో దీటైన పోటీ ఇవ్వగలిగింది. రాష్ట్రవ్యాప్తంగా గట్టి పోటీ ఇస్తుందని భావించిన వైయస్సార్ కాంగ్రెసు కేవలం చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో మాత్రమే ఆధిక్యం కనబరిచింది. కృష్ణా జిల్లాలో కొంత పోటీ ఇవ్వగలిగింది. తెలంగాణ జిల్లాల్లో ఆ పార్టీ ప్రభావం చూపలేదు. సహకార ఎన్నికల తొలిదశలో తెరాస తన ప్రభావం పెద్దగా చూపలేకపోయింది. ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో ఆ పార్టీ బోణీ కూడా కొట్టలేదు. మెదక్‌లో కూడా కాంగ్రెస్ పార్టీ తెరాసతో నువ్వా నేనా అన్నట్లు ముందుకొచ్చింది.

ఇదిలావుంటే, తొలివిడత సహకార ఎన్నికల సందర్భంగా పలు చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. మొత్తం మీద 92.98 శాతం పోలింగ్ జరిగింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి సొసైటీ ఏకగ్రీవమైనా, ఆ సొసైటీ ఎన్నికలను శాంతిభద్రతల పేరుతో ప్రభుత్వం వాయిదా వేసింది. శుక్రవారంనాడు తొలివిడత సొసైటీలకు ఎన్నికయ్యే అధ్యక్షులు, డిసిసిబిలకు ఏ కేటగిరీ సభ్యులు అవుతారు. మలివిడత ఎన్నికలు కూడా పూర్తయిన తర్వాత ఫిబ్రవరి 18న డిసిసిబిలకు ఎన్నికలు నిర్వహిస్తారు.

కాంగ్రె స్ ఆధిక్యం సాధించిన జిల్లాలు: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్.

తెలుగుదేశం పార్టీ ఆధిక్యం సాధించిన జిల్లాలు: కృష్ణా, గుంటూరు, ఖమ్మం

వైయస్సార్ కాంగ్రెసు ఆధిక్యం సాధించిన జిల్లాలు: చిత్తూరు, కడప, అనంతపురం

తెరాస ఆధిక్యం సాధించి జిల్లా: మెదక్

సహకార సంఘాల ఎన్నికల ఫలితాలు ఇలా ఉన్నాయి -
తొలిదశ స్థానాలు 1365
వాయిదా పడినవి 72
కాంగ్రెస్ 595
తెలుగుదేశం 349
వైయస్సార్ కాంగ్రెసు 218
వామపక్షాలు 14
తెలంగాణ రాష్ట్ర సమితి 61
ఇతరులు 42
ఫలితం తేలనివి 78

English summary

 Ruling Congress party has shown its strength in Cooperative societies elections held in first phase. YS Jagan's YSR Congress party has got third place.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X