తెలంగాణ ఇస్తామని చెప్పలేదు: చాకోకు లగడపాటి లేఖ

Lagadapati Rajagopal
న్యూఢిల్లీ: తెలంగాణ ఏర్పాటుకు తమ పార్టీ వ్యతిరేకం కాదన్న కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి పిసి చాకోకు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ గురువారం లేఖ రాశారు. చాకో ప్రకటనను ఆయన తప్పు పట్టారు. బేషరతుగా తెలంగాణ ఏర్పాటు చేస్తామని కాంగ్రెసు ఎప్పుడూ చెప్పలేదన్నారు. తెలంగాణ ఏర్పాటు పైన చాకో చేసిన ప్రకటన జాతీయ, ప్రాంతీయ ప్రసార సాధనాల్లో విస్తృతంగా ప్రచారమైందని అన్నారు.

ఓ వర్గం మీడియా చాకో ప్రకటనకు వాళ్లకు అర్థమైనట్లుగా, అనకూలంగా భాష్యం చెప్పిందని, అది వాస్తవానికి చాలా దూరంగా ఉందన్నారు. అయినా తాను చాకో దృష్టికి ఇప్పటి వరకూ జరిగిన విషయాలను తీసుకు వెళ్లానని చెప్పారు. 2001లో చిన్న రాష్ట్రాల ఏర్పాటు కోసం రెండో ఎస్సార్సీ వేయాలన్న సిడబ్లుసి తీర్మానంతో పాటు శ్రీకృష్ణ కమిటి నివేదిక వరకు జరిగిన అన్ని సంఘటనలకు సంబంధించిన నివేదికలను చాకోకు లగడపాటి పంపించారు.

రాష్ట్ర విభజన దేశ ప్రయోజనాలకు ఏ మాత్రం మేలు చేయదని శ్రీకృష్ణ కమిటీ చెప్పిందని, తెలంగాణ ఇస్తే మత ఛాందసవాదులు, వామపక్ష తీవ్రవాదానికి కేంద్ర బింధువు అవుతుందని స్పష్టం చేసిందని పేర్కొన్నారు. చరిత్ర తిరిగేస్తే కాంగ్రెసు ఎక్కడా అధికారంలోకి వస్తే బేషరతుగా తెలంగాణ ఇస్తామని చెప్పలేదన్నారు. రెండో ఎస్సార్సీ వాటి ద్వారానే తేల్చుతామని చెప్పిందన్నారు. శ్రీకృష్ణ కమిటీ అన్ని రాజకీయ పార్టీల అంగీకారంతో ఏర్పాటయిందని చెప్పారు.

శ్రీకృష్ణ కమిటీ ఆరు ప్రతిపాదనలు చేసిందని, మొదటి నాలగు వాస్తవికంగా సాధ్యం కాదన్న ఉద్దేశ్యంతో తిరస్కరించిందన్నారు. గత్యంతర మార్గం లేకపోతే అందరి అంగీకారంతో మాత్రమే రాష్ట్రాన్ని విభజించాలని సూచించిందని, అందరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సమైక్యంగానే ఉంచడం మేలని ఆరో ప్రతిపాదలో సూచించిందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+