• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బ్రెజిల్ కిస్ క్లబ్ ప్రమాదం: దేశానిదే తప్పన్న యజమాని

By Srinivas
|
Brazil nightclub owner blames country for fie
సాంటామారియా: గతవారం బోట్ కిస్ నైట్ క్లబ్‌లోని అగ్ని ప్రమాదంలో మరణించిన 245 మంది మృతికి బాధ్యత తనది కాదని, మొత్తం దేశానిదని సదరు నైట్ క్లబ్ యజమాని వాదిస్తున్నాడు. ఈ దారుణంపై గురువారం తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసిన నైట్ క్లబ్ యజమాని ఎలిస్సాండ్రో స్పోర్ ప్రమాదానికి కారణాలను మాత్రం మొత్తం దేశానికి ఆపాదించడం గమనార్హం.

శాంటా మారియాలోని కిస్ నైట్ క్లబ్‌లో సంగీత కచేరీ నిర్వహిస్తున్న రాక్ బ్యాండ్ సభ్యుడొకరు మంటను వెలిగించడంతో, అది సీలింగ్ పైనున్న ఫోమ్‌కు అంటుకుని, అది క్షణాల్లో క్లబ్ మొత్తం వ్యాపించడంతో.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్లబ్‌కు ఒకే తలుపు ఉండడం, సమయానికి మంటలను ఆర్పే పరికరంతో పాటు, ఫైర్ అలారం, నీటిని ఆర్పాల్సిన పైపులు.. అన్నీ ఒక్కసారిగా మొరాయించడంతో మృతుల సంఖ్య పెరిగిపోయింది.

దీంతో క్లబ్ యజమాని స్పోర్ ఇప్పుడు.. భవనాన్ని నిర్మించిన ఆర్కిటెక్ట్‌లు, భవనం సురక్షితమని తేల్చిన అధికారులు.. ఇలా ఈ ప్రమాదంలో ఒకరి తర్వాత ఒకరిగా అందరి బాధ్యతా ఉందని, దీనికి మొత్తం దేశానిదే బాధ్యతని ఆయన వాదించారు. మరోవైపు

నైట్ క్లబ్ సహ యజమాని అరెస్టు అనంతరం ఆత్మహత్యాయత్నం చేశారు.

కాగా బ్రెజిల్‌లోని ఓ నైట్ క్లబ్‌లో వారం క్రితం ఘోర అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు 245 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన నైట్ క్లబ్ పేరు కిస్. శనివారం తెల్లవారుజామున 2.30 గంటలకు దక్షిణ బ్రెజిల్‌లోని శాంటామారియా నగరంలోని కిస్ నైట్ క్లబ్బులో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ఇవి వ్యాపించాయి. ఈ సమయంలో క్లబ్బులో ఓ విశ్వవిద్యాలయానికి చెందిన 400 మంది విద్యార్థులు ఉన్నారు.

మంటలు వెలువడటంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ద్వారం ఎటు ఉందో గుర్తించలేక పోయారు. దట్టమైన పొగ వ్యాపించడంతో ఉక్కిరిబిక్కిరి అయి ఊపిరి అందక పలువురు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. షో కోసం వెలిగించిన నిప్పు ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. వేగంగా మంటలు అలుముకోవడం, నల్లటి పొగలు ఆ వెనువెంటనే చుట్టుముట్టడంతో 245 మందికి పైగా ప్రాణాలు పోయాయి. షోలో భాగంగా బ్యాండ్ బృందం స్టేజీపై నిప్పు వెలిగించే ప్రయత్నంలోనే ఈ ఘోర అగ్ని ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

ఈ సమయంలో యూనివర్సిటీకి చెందిన విద్యార్థులతో పాటు క్లబ్‌లో 500 మంది దాకా ఉన్నారు. ఇప్పటిదాకా 180 మృతదేహాలను పోలీసులు గుర్తించా రు. దట్టమైన మంటలు, పొగలతో కమురుకుపోయిన క్లబ్ భవంతి నుంచి మృతదేహాలను బయటకు తీసుకువచ్చారు. క్లబ్‌లో మంటలు అలుముకోగానే భయంతో బయటకు పరిగెత్తే ప్రయత్నంలో జరిగిన తొక్కిసలాటలోనే ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు చెబుతున్నారు. క్లబ్‌లో అత్యవసర ద్వారం సకాలంలో తెరుచుకోలేదని ప్రమాదం నుంచి బయటపడిన వారు చెబుతున్నారు.

ఆ ద్వారాలను రక్షణ బృందాలు బద్దలు కొట్టి మృతదేహాలను బయటకు తీసుకువచ్చాయి. నాలుగైదు గంటలపాటు కష్టపడి అగ్నిమాపక దళాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రధాన ద్వారానికి దగ్గర్లోని విఐపి గదిలో ఉన్నవారు మాత్రమే అప్రమత్తమై ప్రాణాలు కాపాడుకోగలిగారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary

 The owener of a night club in southern Brazil where more than 230 people died in a fire last weekend deflected blame to the whole counntry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more