వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మతం ముసుగులో సంపాదన: షర్మిల, అనిల్‌పై బిజెపి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Anil Kumar - Sharmila
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్‌ల పైన భారతీయ జనతా పార్టీ ఆదివారం తీవ్రస్థాయిలో మండిపడింది. జగన్ సోదరి షర్మిలకు మరో ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర చేసే నైతిక హక్కు లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఎన్‌విఎస్ఎస్ ప్రభాకర్ ధ్వజమెత్తారు. షర్మిల భర్త అనిల్ కుమార్ మతం ముసుగులో వేల కోట్ల అక్రమాస్తులు సంపాదించారని ఆరోపించారు.

షర్మిల, అనిల్ కుమార్‌ల ఆస్తుల పైన ప్రభుత్వం సిబిఐచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అనిల్ అనేక సంస్థల్లో పెట్టుబడులు పెట్టారన్నారు. షర్మిల ఆరు కంపెనీల్లో, అనిల్ 11 కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారన్నారు. అనిల్ కుమార్ కంపెనీలకు కేటాయించిన భూములను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. భూముల కేటాయింపు రద్దు చేయకుంటే ఉద్యమిస్తామన్నారు.

అనిల్ అనేక కంపెనీల్లో వందల కోట్ల పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్, షర్మిల, అనిల్ కుమార్‌లకు కొమ్ముకాస్తున్నారని ధ్వజమెత్తారు. 11 సంస్థల్లో అనిల్ అక్రమ పెట్టుబడులు పెట్టారన్నారు. కిరణ్ ప్రభుత్వంపై జగన్ పార్టీ అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని కాపాడేందుకే జగన్ పార్టీ అవిశ్వాసం పెట్టడం లేదన్నారు.

ఐకాస సమావేశానికి బిజెపి డుమ్మా

తెలంగాణ ఫిలిం చాంబరులో ఏర్పాటు చేసిన తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి సమావేశానికి బిజెపి డుమ్మా కొట్టింది. సమర దీక్షలో తమ పార్టీని అవమానించారంటూ బిజెపి ఈ భేటీకి దూరంగా ఉంది.

English summary
Anil getting crores of rupees in the guise of religion, alleged BJP leader NVSS Prabhakar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X