జోగి రమేష్ వెనుక జగన్ పార్టీ!: బొత్స వర్గం కారుమూరి

ఆయన ఏ పార్టీలో చేరినా ఆ పార్టీ నాయకులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇన్ని మాటలు మాట్లాడిన ఆయన కాంగ్రెస్‌లోనే ఉంటాడని చెప్పగలరా? అని ప్రశ్నించారు. మాటలు మార్చే జోగికి బొత్సను విమర్శించే స్థాయి లేదన్నారు. జోగి రమేశ్ వెనుక ఎవరో అజ్ఞాత వ్యక్తులు ఉన్నారని వారు జగన్ పార్టీకి చెందినవారై ఉండొచ్చనని అనుమానాలు వ్యక్తం చేశారు. జోగి ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో తెలియదన్నారు.
ఆయన సిఎల్పీ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించేందుకు బొత్స కుట్ర చేసినట్లుగా జోగి చేసిన ఆరోపణలు పూర్తిగా తప్పు అన్నారు. రమేష్ వెంటనే తన ఆరోపణలను నిరూపించాలన్నారు. ఇలాంటి ఆరోపణలు సరికాదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం సుస్థిరంగా ఉందని విప్ రుద్రరాజు పద్మరాజు అన్నారు. తీర్మానం పెడితే తమ బలాన్ని నిరూపించుకుంటామని చెప్పారు.
కాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని దించేందుకు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కుట్ర చేస్తున్నారని కాంగ్రెసు శాసనసభ్యుడు జోగి రమేష్ ఆరోపించిన విషయం తెలిసిందే. పార్టీ నుంచి 9 మంది శానససభ్యులను బహిష్కరించినట్లు బొత్స చేసిన ప్రకటనపై ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి పీఠం కోసం బొత్స కాంగ్రెసు పార్టీలో చిచ్చు పెడుతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications