• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భయంతో రాయట్లేదు: మమతకు గంగూలీ చురకలు

By Srinivas
|

Ganguly takes a dig at Salman Rushdie visit cancellation
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కారణంగానే కోల్‌కతా పర్యటనను రద్దు చేసుకున్నానని చెప్పిన ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ ఆరోపణలపై మాజీ భారత క్రికెట్ సారథి సౌరవ్ గంగూలీ స్పందించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పైన ఆయన పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

ఆత్మకథ రాయాలన్న కోరిక ఉన్నప్పటికీ రష్దీలాగా తన పైనా వివాదాలు వస్తాయో అన్న భయంతోనే ఆ పనిని తాను చేయడం లేదన్నారు. కొన్నిసార్లు అన్ని వివరాలనూ బయట పెట్టలేమన్నారు. అటువంటప్పుడు రాయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. మాజీ క్రికెటర్ పటడీకి సంబంధించిన పుస్తకావిష్కరణ సభలో గంగూలీ ఈ వ్యాఖ్యలు చేశారు.

కాగా వివాదాస్పద రచయిత సల్మాన్ రష్దీ మరోసారి వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోల్‌కతాలో అడుగుపెడితే మూటకట్టి వెనక్కి పంపేస్తామంటూ తనను హెచ్చరించినట్టు ఆరోపించారు. దానివల్ల గత నెల 30వ తేదీన కోల్‌కతాకు వెళ్లలేకపోయానని అన్నారు. ఈ మేరకు ఒక పేజీ ప్రకటనను మీడియాకు విడుదల చేసి దేశం విడిచిపోయారు.

ట్విటర్‌లో ఆయన తన వాదనను వినపించారు. గతనెల 30వ తేదీన కోల్‌కతా సాహిత్య సమ్మేళనంలో ఆయన పాల్గొనాల్సి ఉంది. ఆయన నవలకు సినిమా రూపం'మిడ్‌నై ట్ చిల్డ్రన్' ప్రచార కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. కోల్‌కతా వెళ్లేందుకు సర్వం సిద్ధం చేసుకున్నానని, మరుసటి రోజు బయలుదేరతాననగా కోల్‌కతా పోలీసులు తనను సంప్రదించారని, ఎట్టిపరిస్థితుల్లో నగరంలోకి అడుగుపెట్టవద్దన్నారని ఆయన చెప్పారు.

పర్యటన గురించి కావాలనే మీడియాకు, ముస్లిం సంస్థలకు మీరు ఉప్పందించారని ఆయన ఆరోపించారు. ఎందుకు రాకూడదని తాను అడిగితే, కోల్‌కతాలో మత ఘర్షణలు రేపే ఉద్దేశం దీని వెనక కనిపిస్తోందని, దీనివల్ల కోల్‌కతాకు మీరు రాకూడదనేది మమత ఆదేశమని, కాదని వచ్చారా.. తరువాతి విమానంలోనే మిమ్మల్ని మూటకట్టి వెనక్కి పంపించేస్తామని తన విజ్ఞప్తిగా మీకు మా ముఖ్యమంత్రి చెప్పమన్నారని వారు స్పష్టం చేసినట్లు రష్దీ వివరించారు.

అయితే, రష్దీని తామేమీ పిలవలేదని సాహిత్య సమ్మేళనం నిర్వాహకులు వేరే ప్రకటనలో స్పష్టం చేశారు. దానిపై రష్దీ స్పందిస్తూ.. అది అమర్యాదకరమని, వాళ్లే తన విమానం టెకెట్లు బుక్ చేశారన్నారు. మమత ఒత్తిడి వల్లే వాళ్లలా మాట్లాడి ఉండొచ్చని ఆరోపించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former India captain Sourav Ganguly today took an indirect dig at West Bengal Chief Minister Mamata Banerjee and the controversy surrounding Booker prize-winning author Salman Rushdie's cancelled visit to Kolkata.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more