వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు యాత్ర మార్చింది: లగడపాటి, కెసిఆర్‌పై సెటైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తాము వంద సీట్లు గెలుస్తామని చెబుతూ వచ్చారని, ఆ వంద సీట్లు సహకార సంఘాల ఎన్నికల్లో మాత్రమేనని తేలిపోయిందని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. సహకార సంఘాల ఎన్నికల్లో తెరాస కేవలం 120 స్థానాలను గెలుచుకుందని, ఈ వంద స్థానాలకే తెరాస పరిమితమని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

తెలంగాణలో తమ పాలక కాంగ్రెసు పార్టీ పథకాల వల్ల, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి పాదయాత్ర వల్ల పరిస్థితిలో మార్పు వచ్చిందని, భావోద్వేగాలు తగ్గాయని, దానివల్లనే సహకార సంఘాల ఎన్నికల్లో కాంగ్రెసు ఎక్కువ స్థానాలు గెలుచుకుందని ఆయన అన్నారు. తెరాస అట్టడుగు స్థానంలో ఉందని ఆయన చెప్పారు. ఆంధ్ర, రాయలసీమల్లో కన్నా తమ కాంగ్రెసుకు తెలంగాణలో ఎక్కువ మద్దతు లభించిందని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన పథకాల వల్ల రైతాంగమంతా కాంగ్రెసు వైపే ఉందని ఆయన అన్నారు.

స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెసు విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రైతుల మద్దతును కూడగట్టుకున్న విధంగా తమ కాంగ్రెసు పార్టీ సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడగట్టుకుంటుందని ఆయన అన్నారు. సహకార సంఘాల ఎన్నికల్లో కాంగ్రెసు మొదటి స్థానంలో, తెలుగుదేశం రెండో స్థానంలో నిలిచాయని, రాష్ట్రంలో భవిష్యత్తు ఫలితాలు కూడా ఇలాగే ఉంటాయని ఆయన అన్నారు.

తమ ప్రభుత్వం అమలు చేసిన పథకాల వల్ల, పార్టీ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్ల తెలంగాణలో వేర్పాటువాదం, భావోద్వేగం తగ్గుముఖం పట్టినట్లు ఆయన అంచనా వేశారు. తెలంగాణలోని ఏడు జిల్లాల్లో తమ కాంగ్రెసు పార్టీ ముందంజలో ఉందని ఆయన అన్నారు. కార్యకర్తల మాదిరిగానే నాయకులు కూడా కలిసికట్టుగా పనిచేస్తే కాంగ్రెసుకు ఎదురు ఉండదని ఆయన అన్నారు. నాయకులు పార్టీని వీడిపోయినా కాంగ్రెసు ఢోకా లేదని అన్నారు. తమ పార్టీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, పొత్తులు లేకుండానే విజయం సాధిస్తుందని ఆయన అన్నారు.

English summary
Congress Vijayawada MP Lagadapati Rajagopal said that K Chandrasekhar Rao's Telangana Rastra Samithi (TRS) will be limited to 100 seats cooperative societies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X