వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నీరజ్ అంతిమయాత్రలో ఉద్రిక్తత: హరీష్ కాలికి గాయం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kadavendi Neeraj Bharadwaj
వరంగల్: తెలంగాణ కోసం ఆత్మార్పణం చేసుకున్న వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం గూడెప్పాడు విట్స్ కళాశాల విద్యార్థి కడవెంటి నీరజ్ భరద్వాజ్ అంతిమ యాత్రలో మంగళవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంతిమ యాత్రలో తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్, తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీష్ రావు తదితరులు పాల్గొన్నారు. వారు మహాత్మా గాంధీ మెమోరియల్ ఆసుపత్రి వద్ద నీరజ్ మృతదేహానికి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ.. పోరాడి తెలంగాణ సాధించుకుందామని, ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. తెలంగాణపై కాంగ్రెసు పార్టీ స్పష్టమైన వైఖరి తెలుపలేదని కాబట్టి, మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్యలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. అనంతరం మానవ హారం నిర్వహించారు.

ఆ తర్వాత నీరజ్ అంతిమయాత్ర ప్రారంభమైంది. ములుగు రోడ్డులో మంత్రి బస్వరాజు సారయ్య ఫ్లెక్సీని తెలంగాణవాదులు దగ్ధం చేసే ప్రయత్నాలు చేశారు. వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త ముదిరింది. పోలీసుపై తెలంగాణవాదులు రాళ్ల దాడి చేశారు. పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. తోపులాటలో ఎమ్మెల్యే హరీష్ రావు గాయపడ్డారు. ఆయన మోకాలికి గాయం కావడంతో రోహిణి ఆసుపత్రికి తరలించారు. తెలంగాణవాదులు టిడిపి ఎంపీ గుండు సుధారాణి సుప్రభ హోటల్ పైన రాళ్లతో దాడి చేశారు. మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంటిపైనా రాళ్లతో దాడి చేశారు.

కాగా సోమవారం ఉదయం భరద్వాజ్ తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కళాశాలకు వెళ్లిన అతను మరుగుదొడ్డిలోకి వెళ్లి వెంట తెచ్చుకున్న డీజిల్‌ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. సహచర విద్యార్థులు వరంగల్లోని మహాత్మా గాంధీ మెమోరియల్(ఎంజిఎం) ఆసుపత్రికి తరలించారు.

English summary
Massive protests were organised in Warangal after a BTech student commit suicide on Monday in protest against the delay in formation of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X