వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఖిలేష్ భార్య డింపుల్‌కు ఫేస్‌బుక్‌లో గ్రేట్ ఫాలోయింగ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Dimple Yadav
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సతీమణి, కనౌజ్ పార్లమెంటు సభ్యురాలు డింపుల్ యాదవ్ సామాజిక వెబ్ సైట్లలో ఆదరణ చూరగొంటున్నారు. సామాజిక వెబ్ సైట్ అయిన ఫేస్‌బుక్‌లో ఆమెకు ఫాలోవర్స్ క్రమంగా పెరుగుతున్నారు. అమె కొద్ది నెలల క్రితం కనౌజ్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆమె తక్కువ కాలంలోనే సామాజిక వెబ్ సైట్లలో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న రాజకీయ నేతల్లో ఒకరిగా ఉన్నారు.

ఆమె పేరున ఉన్న రెండు ఫేస్‌బుక్ పేజీలలో ఇప్పటికే చాలామంది ఫ్రెండ్స్ రిక్వెస్టులు ఉన్నాయి. మరో మూడు పేజీలలో ముప్పయ్యారు వేలకు పైగా ఫాలోవర్స్‌ను కలిగి ఉన్నారు. అయితే, డింపుల్ యాదవ్ ఫేస్‌బుక్ స్నేహితులతో ఇంటరాక్ట్ కావడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అయితే ఎప్పటికప్పుడు ఫేస్‌బుక్‌లో పలు అంశాలకు సంబంధించి వివరాలను మాత్రం ఉంచుతున్నారు. కాగా రాజకీయ నాయకుల్లో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ 13 లక్షలకు పైగా ఫాలోవర్స్‌తో టాప్‌లో ఉన్నారు.

భద్రత కోసం ఏటా 120 కోట్ల ప్రజాధనం

కాగా ప్రముఖుల భద్రత కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది. పదిహేను వందల మంది విఐపిల భద్రత కోసం అఖిలేష్ యాదవ్ సర్కారు ఏటా సుమారు రూ.120 కోట్లు ఖర్చుపెడుతోందని పోలీసు శాఖ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం 1476 మంది ప్రముఖలకు బందోబస్తు కల్పిస్తున్నామని ఐజీ శాంతిభద్రతల ఐజీ బద్రిప్రసాద్ సింగ్ వెల్లడించారు.

సమాజ్‌వాదీపార్టీ పాలనలో సర్కారీ సురక్ష (ప్రభుత్వం కల్పించే భద్రత)కు ప్రాధాన్యం పెరిగిందని చెప్పారు. వ్యక్తులను ప్రముఖుల జాబితాలో చేర్చడంపై తుదినిర్ణయం రాజకీయనాయకులదేనని, అధికారుల పాత్ర ఏమీ లేదని వెల్లడించారు. తమకూ 'ప్రముఖుల' విభాగంలో రక్షణ కల్పించాల్సిందంటూ దాదాపు పదివేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించా రు. ఎక్కువమంది పోలీసు అధికారులను ప్రముఖుల భ ద్రతకు కేటాయిస్తే .. సాధారణ జనం ఇబ్బందిపడతారని యూపీ పోలీసు మాజీ చీఫ్ కేఎల్ గుప్తా అభిప్రాయపడ్డారు.

English summary
Dimple Yadav Samajwadi MP and wife of UP CM Akhilesh Yadav, is becoming one of the most popular politicians on the Facebook.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X