జగన్ వదిలిన అవినీతి బాణం: షర్మిలపై వేం నరేందర్

దీనికి జగన్, షర్మిల ఏం సమాధానం ఇస్తారని ఆయన అడిగారు. ప్రజా జీవితంలో ఉన్నవారు తమపై వచ్చిన ప్రతి ఆరోపణకూ సమాధానం చెప్పాలని, తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై జగన్ పార్టీ నేతలు చేసిన ప్రతి ఆరోపణకు ఇదే వేదికపై నుంచి సాక్ష్యాలతో సహా సమాధానం ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. అదే పనిని ఆ పార్టీ నేతలు ఎందుకు చేయలేకపోతున్నారని ఆయన అడిగారు.
తెలుగుదేశం పార్టీని తిట్టిపోస్తే వారి తప్పులన్నీ మాఫీ అవుతాయా అని వేం నరేందర్ రెడ్డి ప్రశ్నించారు. తాము ఏ ఒక్క అవినీతిపరుడినీ వదిలిపెట్టబోమని, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధనరెడ్డి మొదలుకొని వైయస్ వరకూ అందరిపైనా పోరాడాం, పోరాడుతున్నామని ఆయన చెప్పారు.
ప్రధాని, రాష్ట్రపతులు, దర్యాప్తు సంస్థలకు సాక్ష్యాలతో సహా ఫిర్యాదులు ఇచ్చామని చెప్పారు. ప్రభుత్వాలు పట్టించుకోకపోతే కోర్టులకు వెళ్లామని గుర్తు చేశారు. వైయస్ కుటుంబ సభ్యులు దోచుకొన్నారు...దాచుకొన్నారని, వారికి నీడగా ఉండే కిరణ్, అండగా నిలిచే బొత్స, మంత్రులు చెబుతుంటే వారిని వదిలిపెట్టి తమపై పడితే ఏం వస్తుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications