కన్నీళ్లు తుడవాలంటే: జగన్ అడిగారు.. శ్రీహరి చెప్పారు!

రాష్ట్రానికి మళ్లీ మీ అవసరముందని జగన్‌కు తాను చెప్పానని, ఎందుకు అని అతను తనను అడిగారని, ప్రజల కష్టాలలో ఉన్నారని, వారి కన్నీళ్లు తుడవాలంటే మీరు రావాలని ఆయనకు వివరించానని శ్రీహరి అన్నారు. మొన్నటి ఆయన లేరని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఆయన రక్తం పంచుకున్న జగన్ ఉన్నారని అభిప్రాయపడ్డారు. మాట తప్పని మడమ తిప్పని వారన్నారు.
మీ కోసం ప్రతి సామాన్యుడు నిరీక్షిస్తున్నాడని తాను జగన్‌కు చెప్పానన్నారు. తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరితే తన స్నేహితులు ఎవరూ భయపడరన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను జగన్ పార్టీ తరఫున ప్రచారం చేస్తానని, పోటీ చేయాలనే కోరిక కూడా ఉందని, జగన్ ఎక్కడి నుండి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడి నుండి చేస్తానని చెప్పారు. జగన్ ఏది ఆశిస్తే అది చేస్తానని శ్రీహరి చెప్పారు.
తనకు అభిమాన గణం బలంగా ఉన్న చోట భారీ బహిరంగ సభ ద్వారా జగన్ పార్టీలో చేరేందుకు శ్రీహరి యోచిస్తున్నారు. ప్రస్తుతం కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని, ఎలాంటి కుమ్మక్కు రాజకీయాలు తెలియని జగన్ వెంట నడవాలని తాను నిర్ణయించుకున్నానని చెప్పారు.












Click it and Unblock the Notifications