అక్బర్‌కు కడుపునొప్పి: సబిత వద్ద ఏడ్చిన కార్పోరేటర్

ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన మజ్లీస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ అరెస్టుపై నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. రాజేంద్రనగర్ మున్సిపల్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని మజ్లీస్ నాయకులు, కార్యకర్తలు శనివారం అడ్డుకున్నారు. ప్రభుత్వం కుట్రపూరితంగా అక్రమ కేసులు బనాయించి, తమ పార్టీ నేతలపై దౌర్జన్యం చేస్తోందని వారు విమర్శించారు.
అక్బరుద్దీన్‌పై పెట్టిన కేసులను వెంటనే ఎత్తేయాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళనకు దిగిన మజ్లీస్ కార్యకర్తలను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు హోం మంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మజ్లీస్ అత్తాపూర్ కార్పోరేటర్ సబితా ఇంద్రారెడ్డి వద్ద ఏడ్చేశారు. అక్బరుద్దీన్ అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆయన మంత్రికి చెప్పుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో చేసిన ద్వేషపూరిత వ్యాఖ్యలకు గాను అక్బరుద్దీన్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నిజామాబాద్‌లో కూడా ఓ కేసు నమోదైంది. రాష్ట్రంలోని పలు చోట్ల ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఆయన బెయిల్ లభించడం లేదు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications