అఫ్జల్ గురుకు ఉరి: మూడు రోజులు కాశ్మీర్ బంద్

జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జెకెఎల్ఎఫ్) వ్యవస్థాపకుడు మక్భూల్ భట్‌కు తీహార్ జైలులో 1984 ఫిబ్రవరి 11వ తేదీన ఉరిశిక్ష అమలు జరిగింది. అతన్ని తీహార్ జైలులోనే ఖననం చేశారు. అఫ్జల్ గురును ఉరితీసిన నేపథ్యంలో కాశ్మీర్‌లో కర్ఫ్యూ విధించారు.
కాగా, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శుక్రవారం న్యూఢిల్లీలోనే ఉన్నారు. అఫ్జల్ గురు మెర్సీ పిటిషన్‌ను తిరస్కరించినట్లు ఆయనకు తెలియదని అంటున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావద్దని శ్రీనగర్‌తో పాటు ఇతర నగరాల్లో అధికారులు లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రజలకు సూచిస్తున్నారు. భారీగా పారా మిలిటరీ బలగాలను మోహరించారు.
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శ్రీనగర్ - జమ్మూ జాతీయ రహదారిని అధికారులు మూసేశారు. వేర్పాటువాద నాయకుల ఇళ్ల వద్ద భారీగా పారా మిలిటరీ బలగాలను మోహరించారు. వీధుల్లోకి వచ్చి హంగామా చేయకుండా నిరోధించేందుకు ఆ బలగాలను మోహరించారు.
మక్బూల్ భట్ ఉరిశిక్షను నిరసిస్తూ ఫిబ్రవరి 11వ తేదీన జెకెఎల్ఎఫ్ కార్యకర్తలు అమర వీరుల దినాన్ని నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో అఫ్జల్ గురుకు ముందుగానే ఉరిశిక్ష అమలైంది. ఉత్తర కాశ్మీర్‌లో సోపోర్‌కు చెందిన అఫ్జల్ గురు జైషే మొహమ్మద్ కార్యకర్త.












Click it and Unblock the Notifications