హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేతలకు అసభ్యమెసేజ్‌లు: జయసుధ ఫిర్యాదుతో అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jayasudha
హైదరాబాద్: ప్రముఖులకు అసభ్యకర సంక్షిప్త సందేశాలను పంపిన కృష్ణ అనే వ్యక్తిని నార్త్ జోన్ టాస్క్ ఫోర్సు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. మంత్రులకు, మహిళా ఎమ్మెల్యేలకు గత కొంతకాలంగా కృష్ణ వందలాది అసభ్యకర సంక్షిప్త సందేశాలు పంపించాడు. కాంగ్రెసు పార్టీ సికిందరాబాద్ శాసనసభ్యురాలు జయసుధ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జయసుధ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని గుర్తించిన నార్త్ జోన్ టాస్క్ ఫోర్సు పోలీసులు అతనిని ఈ రోజు అరెస్టు చేశారు.

కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు

ఉప్పల్‌లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసి పడుతుండడంతో చుట్టు ప్రక్కల నివాసితులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఫ్యాక్టరీకి సమీపంలో గ్యాస్ గోడౌన్ ఉండడంతో ప్రజలు భయాందోళను చెందారు. ప్రమాదానికి గల కారణాలు తెలియ రాలేదు. ఆస్తి నష్టం ఏ మేరకు జరిగింది తెలియలేదు.

వేధింపులకు వ్యక్తి ఆత్మహత్య

నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలంలో మరమరాల వ్యాపారి గంజి వెంకటేశ్వర్లు వద్ద కూరాకుల వెంకన్న గుమాస్త్గా పని చేస్తున్నాడు. మరమరాలకు కావాల్సిన ముడి సరుకులు కొనే రైసు మిల్లులో 25 క్వింటాళ్ల బియ్యం పోవడంతో వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో వెంకన్నే దొంగ అని భావించిన పోలీసులు అతనిని చితకబాది వదిలేశారు. నాటి నుండి పోలీసులు తనను వేధిస్తున్నారని మనస్తాపానికి గురైన వెంకన్న ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

English summary
A youth arrested by Nortzone Taskforce police on Monday in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X