యాత్రలో బాధలు ఏకరువుపెట్టిన బాబు: గెల్చినా సిఎంనే

Chandrababu Naidu
గుంటూరు: తనకు జీవితంలో ఎప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని ఇప్పుడు కొత్తగా బిపి తదితర ఇతర సమస్యలు వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు. చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర గుంటూరు జిల్లాలో ఏడోరోజు కొనసాగుతోంది. పెదకాకాని మండలం ఉప్పలపాడు నుంచి ఆయన తన పాదయాత్రను ఈరోజు ప్రారంభించారు.

ఉపాధి పేరుతో, సాగునీటి పేరుతో కాంగ్రెసు పార్టీ నేతలు కోట్లు దండుకున్నారని మండిపడ్డారు. రైతులు, పేదల ఆలోచనలో మార్పు రావాలని కోరారు. తన జీవితంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, ఇప్పుడు పలు సమస్యలు వస్తున్నాయన్నారు. అయినా, మీ కష్టాల ముందు తన సమస్య ఓ లెక్క కాదన్నారు. తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్లు పని చేశానని, మళ్లీ గెలిచినా కొత్తగా వచ్చేదేమీ లేదన్నారు.

గెలిస్తే ముఖ్యమంత్రిని అవుతానే తప్ప కొత్తగా వచ్చేది లేదన్నారు. కాంగ్రెసు పార్టీ అబద్దాలు చెప్పి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రజలు ఇప్పుడిప్పుడే వాస్తవాలను తెలుసుకుంటున్నారన్నారు. బీహార్, గుజరాత్ రాష్ట్రాలు అభివృద్ధితో దూసుకు పోతుంటే మన రాష్ట్రం మాత్రం ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. తాను అనుకున్నది సాధించే వరకు నిద్రపోయే వ్యక్తిని కాదన్నారు.

తాను పాదయాత్ర ప్రారంభించినప్పుడు ఒకటి రెండు రోజులకు మించి చేయరని కొందరు భావించారన్నారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చిన ఘనత దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిదే అన్నారు. ఇదే విషయాన్ని కాగ్ కూడా ఎత్తి చూపిందన్నారు. రుణ మాఫీ సాధ్యం కాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పడం సరికాదన్నారు. అది ఆయన చేతకానితనానికి నిదర్శనం అన్నారు. పోలవరం కట్టకుండానే రూ.10వేల కోట్లను ఖర్చుపెట్టారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+