ఆ ఒక్కరూ జంప్!: జైల్లో జగన్‌ని కల్సిన టిడిపి ఎమ్మెల్యే

వీరు ముగ్గురు త్వరలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. పార్టీలోకి వచ్చే విషయం, ఎప్పుడు జాయిన్ కావాలో తదితర అంశాలపై శిరియ సాయిరాజ్ జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డితో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో పది నియోజకవర్గాలు ఉండగా తెలుగుదేశం పార్టీకి ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన సాయిరాజ్ ఒక్కరే.
కాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు షాక్ మీద షాక్ తగులుతోంది. మొన్నటి వరకు అడపా దడపా కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి టిడిపి నుండి పలువురు నేతలు వెళ్లినా ఇప్పుడు అది మరింత ఎక్కువయింది. నిన్నటి వరకు ఇలా వరుస జంపింగులు అధికార కాంగ్రెసు పార్టీలో ఉండగా... ఇప్పుడు టిడిపి వంతయింది.
గురువారం తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు జైలులో జగన్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. మరుక్షణమే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ టిడిపి ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. చంద్రబాబు విధానాలు నచ్చకే తాను టిడిపిని వీడుతున్నట్లు జగన్‌తో భేటీ తర్వాత జైలు బయట రామారావు విలేకరులకు చెప్పారు. కుటుంబసమేతంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పని చేసేందుకు సిద్ధమన్నారు.












Click it and Unblock the Notifications