మణికొండలో కబ్జా ఆరోపణలు: బ్రదర్ అనిల్ పైనా వేటు!

తమ భూమి తమకు ఇప్పించాలని వారు కోరారు. ఈ భూమి వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ అనిల్ లాక్కొని చర్చి నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. తమ భూమిని లాక్కోవడంపై ప్రశ్నిస్తే దౌర్జన్యానికి దిగుతున్నారని ఆరోపించారు. ఈ భూమిని అనిల్ కుమార్ తన మత ప్రచార భాగస్వామి శ్యాం కిషోర్ పేరిట అక్రమంగా లీజుకు తీసుకున్నారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ భూమికి సంబంధించి హెచ్ఎండియే నోటీసులు కూడా జారీ చేసింది.
కాగా బాధితులకు తెలంగాణ క్రైస్తవ సంఘం, రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల సంఘం మద్దతు ప్రకటించాయి. క్రైస్తవ మతాన్ని అడ్డం పెట్టుకొని కబ్జాలకు పాల్పడుతున్న బ్రదర్ అనిల్ కుమార్‌ను మతం నుంచి బహిష్కరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలంగాణ క్రైస్తవ సంఘం ప్రకటించింది. ఆయన కారణంగా క్రైస్తవ మతానికి చెడ్డపేరు వస్తుందని, యాదయ్య కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతామన్నారు. మతం ముసుగులో అక్రమాలు పాల్పడటం సరికాదన్నారు.
కాగా, వరుస ఆరోపణల నేపథ్యంలో వైయస్ కుటుంబాన్ని రాష్ట్రవ్యాప్తంగా దళిత క్రైస్తవుల నుంచి వెలేస్తున్నట్లు తెలంగాణ క్రైస్తవ సంఘాల సమాఖ్య కన్వీనర్ మత్తయ్య ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అవినీతి ఆరోపణలు, అక్రమ ఆస్తులు, నిధుల దుర్వినియోగంతో పాటు.. వైయస్ అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ మత సంస్థల పేరుతో కోట్లాది రూపాయల నిధులను మళ్లించడం దారుణమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications